Home తాజా వార్తలు కారు బోల్తా పడి ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు

కారు బోల్తా పడి ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు

One killed And three injured in car overturned

రిమ్మనగూడ: సిద్దిపేట మండలం రిమ్మనగూడ వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు బోల్తాపడి ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు సమీప దవాఖానకు తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.