Home తాజా వార్తలు ఏడాదిలోగా లక్ష ‘డబుల్ బెడ్‌రూం ఇండ్లు’

ఏడాదిలోగా లక్ష ‘డబుల్ బెడ్‌రూం ఇండ్లు’

ktr

హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరంలో వచ్చే సంవత్సరంలోగా లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్ల్లు రాష్ట్ర ఐటి పురపాలక శాఖమంత్రి కెటిఆర్ తెలిపారు. నగరంలోని జలమండలి కార్యాలయంలో గురువారం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై మంత్రి కెటిఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ నవీన్ మిట్టల్, పలువురు అధికారులు పాల్గొన్నారు.