Thursday, April 25, 2024

అవయవదాత కుటుంబానికి డబుల్ బెడ్‌రూం: ఎంఎల్ఎ గాదరి

- Advertisement -
- Advertisement -

నర్సిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్

మన తెలంగాణ/మోత్కూరు: అవయవదాత వరకాంతం నర్సిరెడ్డి కుటుంబాన్ని సోమవారం తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్ సందర్శించి పరామర్శించారు. నర్సిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నర్సిరెడ్డి కుటుంబ సభ్యులకు రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్నిదానాల్లోకెల్లా అవయవదానం ఎంతో గొప్పదని, అవయవదానంపై అవగాహన పెంపొందించుకోవాలని, అవయవదానానికి ముందుకు రావాలన్నారు. అవయవదాత నర్సిరెడ్డి కుటుంబానికి డబుల్ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయిస్తానని, ఇద్దరు కుమారులను గురుకుల పాఠశాలలో చదివిస్తానని హామీ ఇచ్చారు. తాను మరణిస్తూ మరో ఐదు కుటుంబాల్లో వెలుగులు నింపిన నర్సిరెడ్డి కుటుంబ నిర్ణయం ఎంతో గొప్పదన్నారు. నర్సిరెడ్డి లేని లోటు ఆ కుటుంబానికి తీర్చలేనిదని, ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, మున్సిపల్, మార్కెట్ వైస్ చైర్మన్లు బి.వెంకటయ్య, కొణతం యాకూబ్‌రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్లు తీపిరెడ్డి మేఘారెడ్డి, చిప్పలపల్లి మహేందర్‌నాథ్, టీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, బొడ్డుపల్లి కల్యాణ్‌చక్రవర్తి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాంపాక నాగయ్య, నాయకులు సామ పద్మారెడ్డి, పురుగుల వెంకన్న, రమేష్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

రూ.లక్ష ఆర్థిక సాయం అందజేసిన స్నేహితులు

అవయవదాత నర్సిరెడ్డి భార్య నిర్మల స్నేహితులైన నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు ఉన్నత పాఠశాల 1997-1998 ఎస్‌ఎస్‌సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు సోమవారం రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు. నిర్మలను, ఆమె కుమారులను పరామర్శించారు. అన్ని విధాలా అండగా ఉంటామని స్నేహితురాలికి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అమ్మనబోలు ఉన్నత పాఠశాల 1997-98 ఎస్‌ఎస్‌సి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News