Saturday, December 2, 2023

రోడ్డు పక్కన కారులో మృతదేహం….

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/బోధన్: పట్టణంలోని హెడ్‌పోస్టాఫీసు ప్రాంతంలోని ప్రధాన రహదారి పక్కన నిలిపి ఉన్నకారులో వ్యక్తిమృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీసులు గురువారం గుర్తించారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మృతుడు శ్రీనివాస్‌గౌడ్(48) మహారాష్ట్ర నుండి హైదరాబాద్‌కు వెళుతున్నాడని మృతుడికి గతంలో బీపి  పట్టణ సీఐ ఎస్ రామన్ తెలిపారు. మహారాష్ట్ర నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న మృతుడు శ్రీనివాస్‌గౌడ్ బోధన్ పోస్టాఫీస్ ప్రాంతానికి తన కారులో వస్తుండగా గుండెపోటు వచ్చి ఉంటుందని కారును రోడ్డు పక్కన ఆపుకొని కారు సీటులో మృతి చెందాడని సీఐ తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News