Home తాజా వార్తలు రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

Railway-Track

కాచిగూడ : మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాచిగూడ రైల్వేపోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్ డి. విజయలాల్ కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం చెరువు కొమ్మతండా గ్రామానికి చెందిన ముడవత్ కాలియా కుమారుడు ముడవత్ రమేష్ (29) అతడు అంబర్‌పేటలోని బతుకమ్మకుంటలో ఉంటూ ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రమేష్‌కు గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ, మనస్తాపానికి గురై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం కాచిగూడ-విద్యానగర్ రైల్వే స్టేషన్లు మధ్యలో రైలు కిందపడి అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని  మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఆర్. లాల్యనాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.