Home తాజా వార్తలు కారు బీభత్సం: ఒకరి మృతి

కారు బీభత్సం: ఒకరి మృతి

 

Car Accident

 

శామీర్ పేట: మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం తూముకుంట వద్ద రాజీవ్ రహదారిపై ఆదివారం ఉదయం కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.  

Telangana news

 

One Member Dead in Car Accident in Medchal