Home తాజా వార్తలు షాబాద్ లో రోడ్డు ప్రమాదం… ఒకరి మృతి

షాబాద్ లో రోడ్డు ప్రమాదం… ఒకరి మృతి

 

షాబాద్: బైక్ ను లారీ ఢీకొట్టిన సంఘటన శనివారం ఉదయం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా వెనకంగా వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి ఆ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఒక వ్యక్తి ఘటనా స్థలంలో దుర్మరణం చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం  షాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  ఆ లారీ తమిళనాడు రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

One Member Dead in Lorry Collided to Bike in RR