Home జోగులాంబ గద్వాల్ రెండు లారీలు ఢీ: ఒకరి మృతి

రెండు లారీలు ఢీ: ఒకరి మృతి

Lorry-Accident

మానవపాడు: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని మరో లారీ వెనక నుంచి ఢీకొట్టడంతో డ్రైవర్ ఘటన స్థలంలో మృతి చెందగా క్లినర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్లినర్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రహదారిపై ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు.