Home తాజా వార్తలు ఆగి ఉన్న డిసిఎంను ఢీకొట్టిన బైక్: ఒకరు మృతి

ఆగి ఉన్న డిసిఎంను ఢీకొట్టిన బైక్: ఒకరు మృతి

One Members dead in Bike collided DCM

యాదాద్రి భువనగిరి: ఆగి ఉన్న డిసిఎంను బైక్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు అన్నదమ్ములు తన సోదరితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఆగి ఉన్న డిసిఎంను బైక్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.