Home తాజా వార్తలు నయీం అనుచరుడి అరెస్ట్

నయీం అనుచరుడి అరెస్ట్

acb-arrested-in-bribe-imageహైదరాబాద్ : ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం మరో అనుచరుడిని సిట్ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పటాన్‌చెరు మండలం ముత్తంగిలో నయీం అనుచరుడు సామ సంజీవరెడ్డిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముత్తంగిలోని శ్రీవిష్ణు లాడ్జీలో దాగున్న సంజీవరెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు. తన కుమారుడు స్పూర్తివర్థన్ రెడ్డి పేరుతో లాడ్జిలో రూం నెం.204 ను సంజీవరెడ్డి బుక్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆదిభట్ల, మహేశ్వరం, వనస్థలిపురంలో సంజీవరెడ్డి భూదందాలు చేసేవాడని సమాచారం.