Home వార్తలు కోడిరామకృష్ణ మరో విజువల్ వండర్

కోడిరామకృష్ణ మరో విజువల్ వండర్

kodiramakrishnaఅరుంధతి, దేవిపుత్రుడు, అమ్మోరు వంటి ఐకానిక్ సోషియోఫాంటసీ చిత్రాలను అందించిన దర్శకుడు కోడిరామకృష్ణ. ఈ సుప్రసిద్ధ దర్శకుడు చాలాకాలం గ్యాప్ తర్వాత కన్నడలో ఓ విజువల్ వండర్‌ను తెరకెక్కిస్తున్నారు. వెటరన్ హీరో విష్ణువర్ధన్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. దాదాపు ఏడు సంవత్సరాల క్రిందట మృతిచెందిన ఈ కథానాయకుడు ఎలా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు అనే సందేహం ఎవరికైనా వస్తుంది. కానీ కోడిరామకృష్ణ తాను తెరకెక్కించే ‘నాగరహవు’ చిత్రంలో డిజిటల్ మీడియా, విజువల్ ఎఫెక్ట్ సహాయంతో విష్ణువర్ధన్‌ను సృష్టించి సినిమాను రూపొందిస్తున్నారట. ఇటీవల సినిమా టీజర్‌ను విడుదల చేస్తే విష్ణువర్ధన్ అభిమానులు, ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఏడుగురు విఎఫ్‌ఎక్స్ స్పెషలిస్ట్ పనిచేస్తున్నారట. 730 రోజుల పాటు వీరంతా ఈ విజువల్ ఎంటర్‌టైన్ కోసం పనిచేశారు. జూలైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.