Home జాతీయ వార్తలు జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ… ఒకరి మృతి

జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ… ఒకరి మృతి

jail

 

ఉత్తర ప్రదేశ్: ఇద్దరు ఖైదీలు జైలు నుంచి తప్పించుకొని పరిపోతున్న క్రమంలో ఓ ఖైదీ ప్రమాదవశాత్తు రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఈటావా జిల్లాలో చోటు చేేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈటావా జిల్లా జైలులో రామానంద్‌ (45), చంద్రప్రకాశ్‌ అనే ఇద్దరు ఖైదీలు వేర్వేరు హత్య కేసుల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నారు. జైలులో రమానంద్, చంద్రప్రకాశ్ లు ఆదివారం తెల్లవారుజామున జైలులోని  సరిహద్దు గోడపైకి ఎక్కి పారిపోయారు. డిప్యూటీ జైలర్ జగదీష్ ప్రసాద్ మామూలు తనిఖీకి వెళ్ళినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

అయితే రమానంద్‌ గోడ దూకి తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు పక్కనే రైల్వే ట్రాక్‌ పై పడి మృతి చెందాడు. అది గమనించిన రైల్వే పోలీసులు రమానంద్ మృతదేహాన్ని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.  మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపులు చర్యలు చేస్తున్నట్టు జైలు సూపరింటెండెంట్ రాజ్ కిశోర్ సింగ్ తెలియజేశారు.

one person died in 2 inmates who escaped from jail in UP