Home జాతీయ వార్తలు కదులుతున్న బస్సులో కాల్చి చంపారు

కదులుతున్న బస్సులో కాల్చి చంపారు

GUNచెన్నై: బస్సు వేగంగా నడుస్తున్నప్పుడు ఓ ప్రయాణికుడిని దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన తమిళనాడులోని విరుద్‌నగర్‌లో చోటుచేసుకుంది. ప్రయాణికుడిడినితుపాకీతో కాల్చగానే బస్సులో ఉన్న ప్రయాణికుల అరుపులు, కేకలతో మార్మోగిపోయింది. దీంతో బస్సు డ్రైవర్ సడెన్‌గా బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. దుండగుడితో సహా మరో వ్యక్తి బస్సులో నుంచి దూకి పారిపోయారు. మృతుడిని కరప్పాస్వామిగా(30) పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.