Home జాతీయ వార్తలు జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం

 

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రత బలగాలు ఓ ఉగ్రవాది హతమార్చారు. కుల్గామ్ జిల్లాలోని దమ్హాల్ హంజిపొరా ప్రాంతంలో సోమవారం ఉదయం భద్రత బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. దమ్హాల్ హంజీపోరా ప్రాంతంలోని ఖుర్ గ్రామంలోని ఓ ఇంటిలో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు సమాచారం అందడంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ, సిఆర్ పిఎఫ్ జవాన్లు కలిసి సంయుక్తంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రత దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సైనికులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఓ ఉగ్రవాది మృతి చెందాడని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ ప్రాంతంలోనే చిక్కుకున్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు.

One Terrorist killed in Kulgam encounter in J&K