Home Default ఏడాదిలో ఐదు సర్కార్ కొలువులు

ఏడాదిలో ఐదు సర్కార్ కొలువులు

Kranthi

హైదరాబాద్: ఒక్క ఉద్యోగం సాధించడం కష్టంగా మారిన ఈ రోజుల్లో ఓ యువకుడు ఒకే ఏడాదిలో ఏకంగా ఐదు సర్కార్ ఉద్యోగాలు సాధించాడు. వివరాలలోకి వెళితే..తుడుం క్రాంతి మహేశ్వరం గ్రామవాసి. ప్రస్తుతం క్రాంతి శంషాబాద్ వీఆర్వోగా పని చేస్తున్నాడు. తాజాగా విడుదలైన గ్రూప్ 2 ఫలితాల్లో అమ్మకం పన్ను విభాగంలో ఏసిటివోగా ఎంపికయ్యారు.2019 మార్చి లో వీఆర్వోగా ఎంపికైన తర్వాత, ఏప్రిల్ లో బిల్ కలెక్టర్, ఆగస్టులో జూనియర్ పంచాయతీ కార్యదర్శి, సెప్టెంబర్ లో గ్రూప్ 4 ఉద్యోగానికి ఎంపికయ్యారు. తొలి ప్రయత్నంలోనే ఏసిటివోగా ఎంపికైనందుకు క్రాంతి సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

One Young Man Archived Govt Jobs