Saturday, April 20, 2024

గ్రామాల్లో కొనసాగుతున్న నిరక్షరాస్యత!

- Advertisement -
- Advertisement -

illiteracy

 

హైదరాబాద్ : గ్రామాల్లో ఇంకా నిరక్షరాస్యత కొనసాగుతోంది. 18 సంవత్సరాలు పై బడిన వారిలో చదువురాని వారి సంఖ్య రాష్ట్రంలో సుమారు 25 లక్షలకు పైగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రెండవ విడత పల్లె ప్రగతిలో ప్రతి గ్రామంలో చదువు రాని వారి వివరాలను తాజాగా సేకరించింది. ఇందులో మొత్తం 12,751 గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 2,04,664 మంది జనాభా ఉండగా అందులో 25,03,901 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లుగా గుర్తించారు.

ఇందులో సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 1,54,804 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. కాగా హైదరాబాద్ నగర శివారులోని మేడ్చల్…మల్కాజ్‌గిరి జిల్లాలో అత్యల్పంగా 9,720 మంది చదువురాని వారుఉన్నారు. అలాగే సంగారెడ్డిలో నిరక్షరాస్యుల సంఖ్య 48,125 కాగా, సిధ్ధ్దిపేట్‌లో 44,533, వరంగల్ రూరల్ 48,775, మూలుగులో 23,545, పెద్దపల్లిలో 38,976, వనపర్తిలో 38,419, నిజామాబాద్‌లో 80,397, రంగారెడ్డిలో 85,234, రాజన్న సిరిసిల్లాలో 40,830, జగిత్యాలలో 85,676, ఆదిలాబాద్‌లో 31,353, నల్గొండలో 1,47,454, మంచిర్యాలలో 55, 419, వికారాబాద్‌లో 1,02,836, జయశంకర్ భూపాలపల్లిలో 45,145, కామారెడ్డిలో 1,01,375, జనగాంలో 55,487, మెదక్‌లో 93,124, కుమరంభీమ్ ఆసిఫాబాద్ 72,917, జోగులాంబ గద్వాల్ 55,967, మహబూబాబాద్ 1,04,192, ఖమ్మం 1,32,412, యాదాద్రి భువనగిరి 98,364, నాగర్‌కర్నూల్ 1,06,051, కొత్తగూడెం 1,21,847, మహబూబ్‌నగర్ 1,16,826, కరీంనగర్ 82,969, నిర్మల్ 1,21,997, నారాయణ్‌పేట్ 85,564, వరంగల్ అర్భన్‌లో 45,386 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన సంవత్సవరంలో విద్యకు అధిక ప్రాధాత్యను ఇస్తున్నట్లు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు ఈచ్ వన్…టీచ్ వన్ పేరుతో ప్రత్యేకంగా ప్రణాళికలను సిద్దం చేస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి సుమారు 73 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా అక్షరాస్యత గ్రామాల్లో కొనసాగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సిఎం కెసిఆర్ తెలంగాణలో సాధ్యమైనంత త్వరగా అక్షరాస్యతను సాధించాలని లక్షంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Ongoing illiteracy in villages
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News