Home నిజామాబాద్ ఆన్‌లైన్ బేరం.. అంతా మోసం!

ఆన్‌లైన్ బేరం.. అంతా మోసం!

Online Fraud

ఆర్మూర్ : మనిషి ఆశ జీవి.. ఒక్కటి కొంటే మరోకటి ఫ్రీ అనగానే ఎగిరి గంతేసి దెబ్బ తింటున్నాడు. పేదల ఆలోచనను సొమ్ము చేసుకుంటూ కొందరు వ్యాపారాలు ఇట్టే మోసం చేస్తున్నారు. తక్కువ ధరకే వస్తువులు అనగానే ఆగమై ఇబ్బందులకు గురౌతున్నారు. ఇక కొంత లాభానికి వెళ్తే ఉన్నది పోయి తలకు చేతులు పెట్టుకొక తప్పడం లేదు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక జరిగిన నష్టాన్ని పూడ్చుకొలేక సతమతమవుతున్నారు. ఇలాంటి సంఘటనలు రెండు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అమేజాన్‌లో తక్కువ రేటుకు మంచి వస్తువు లభిస్తుందన్న ఆశా మొదటికే మోసం తెచ్చిపెట్టింది.

‘బ్లూటూత్ లెస్ వైర్’..

బాల్కొండ మండలం బొదేపల్లికి చెందిన జె. సాయన్న మ్యూజిక్ బ్లూటూత్(వైర్‌లెస్‌ది) బాగుంటుందని మిత్రుల ద్వారా తెలుసుకొని ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకొని తెప్పించుకున్నాడు. తీరా విప్పి అందులో చూస్తే వైర్‌లెస్ బ్లూటూత్ లేదుగాని వైరు మాత్రం ఉంది. దాంతో అవక్కైన సాయన్న తెరుకునే లోపే నగదు నడుచుకుంటూ వెళ్లిపోయింది. పోస్ట్‌మెన్‌కు డబ్బు కట్టిన తర్వాత విప్పి చూస్తే అసలు విషయం తెలిసి డబ్బుకట్టి మోస పోయానని అవేదనకు గురయ్యాడు.

నిండా ముంచిన ముత్యాలహారం

ఆర్మూర్ మండలం చేపూర్‌కు చెందిన లింగంకు సెల్ ఫోన్ కు కాల్ వచ్చింది. మీరు చాలా అదృష్టవంతులు రూ. 10,000ల విలువ చేసే ముత్యాలహారం రూ. 3,500లకే మీరు లక్కిడ్రా ద్వారా సాధించారు. అలస్యం చేస్తే ఆఫర్ మిస్సవుతారు. అంటు ఆ అతివ తీపి మాటలలో ముంచేత్తింది. ఇప్పుడు వేంటనే తీసుకుంటే లక్ష్మిదేవి పెండెంట్, హన్మాన్ కవచం వస్తుంది. విడివిడిగా విటిని కొంటే రూ. 15,000పై చీలుకవుతుంది. అది మీరు ఈ రోజు చెబితేనే పంపడం కుదురుతుందని అనడంతో లింగం సరే పంపడని అన్నాడు. ఎందుకంటే టివిల్లో లక్ష్మిదేవి పెండెంట్, హన్మాన్ కవచం లాంటివి నిత్యం చూస్తున్నాడు మరీ ఎందుకు ఆలస్యం చేయడం అనుకొని పంపండి అన్నాడు.

ఇంకేముంది అన్న నాలుగు రోజుల్లోనే ఇంటికి పోస్ట్‌మ్యాన్ ద్వారా రానే వచ్చింది. విప్పిచూసి డబ్బులిస్తానని అన్నాడు లింగం. అలాంటిదేమి ఉండదని డబ్బులు ఇచ్చిన తర్వాతనే అని పోస్ట్‌మెన్ అనగానే బాక్స్ ఆయితే పెద్దగానే ఉంది అనుకొని రూ. 3,500లు ఇచ్చి అట్ట బాక్స్ (వచ్చిన) ప్యాక్‌ను తీసుకున్నాడు. అంతే అందులో ఉన్న వస్తువులు చూసే సరికి దిమ్మ తిరిగి గుండే ఆగినంత పనైంది. అందులో చిన్న పంచ హన్మాన్ విగ్రహం, రెండు హన్మాన్ లాకెట్లు, ఒక హన్మాన్ చాలీసా పుస్తకం, ఒక హన్మాన్ ఫోటో, గోల్డ్ ప్లేటేడ్ యంత్రం, హన్మాన్ సిడి ఉన్నాయి. తాను మోసపోయానని గ్రహించి చేసేదేమి లేక తల బాదుకున్నడు. ఇట్టి విషయం ఇంటి వద్ద తెలిస్తే ఇక అంతే అనుకున్న ఆయన ఇటు డబ్బు పాయే అది కాస్త తెలిస్తే ఇంట్లో గొడవాయే ఎందుకులే అనుకోని మధనపడ్డాడు.

మోసాలను ప్రజలు గుర్తించాలి

Cyber-crime1

ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు అని, ఒకటి కొంటే మరోక్కటి ఫ్రీ అని నిత్యం జరుగుతున్న మోసాలను ప్రజలు గుర్తించాలి. ఇవి మనకు తెలిసినవి మాత్రమే ఇంక తెలియకుండా ఎన్నో జరుగుతున్నాయి. ఇక నైన ప్రజలు ఆలోచించక తప్పదు మరీ. ఒక వస్తువు కొనలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి చూసి కొంటాము. అలాంటిది. ఆన్‌లైన్‌లో ఆ వస్తువును ఏలా గుర్తిస్తారు. కాబట్టి ఆన్‌లైన్ బేరం విషయంలో ఆలోచించి అర్డర్ చేయండని వ్యాపారవేత్తలు, అధికారులు అంటున్నారు.