Home తాజా వార్తలు టీచర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్

టీచర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్

TSPSC

మనతెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన తెలుగు భాషా పండిట్, తెలుగు మీడియం స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం పోస్టులకు ఆన్‌లైన్‌లో సర్టిఫివెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి వెల్లడించింది. ఈ నెల 4 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించిన సమాచారం త్వరలో తెలియజేస్తామని పేర్కొంది.

Online Certificate Verification for Teacher Posts Replacement in TS