Home నాగర్ కర్నూల్ అన్‌లైన్ మోబైల్ పేరుతో మోసాలు

అన్‌లైన్ మోబైల్ పేరుతో మోసాలు

Smart-Phone

కొల్లాపూర్: పట్టణంలోని పలు మోబైల్ దుకాణాలలో అన్‌లైన్ పోన్లు తెప్పించి వేలాది రూపాయాలను తమనుండి వసూలు చేస్తున్నారని పలు వురు వినియోగదారులు వాపోతున్నారు.తమకు ఇచ్చి న సెల్‌పోన్ ధరలు తెలుసుకుంటున్న వినియోగదా రు లు మోబైల్ దుకాణం దారులు  ఎక్కువ డబ్బులు తీసు కుంటున్నారని మిగత డబ్బులు వాపసు ఇవ్వాలని కోరుతే ఇవ్వమని ఎవరికి చేప్పుకుంటారో చెప్పుకోండి అంటూ తమను నిర్లక్షం చేస్తున్నారని వారు వాపోతు న్నారు. మండలంలో ఎల్లూరు గ్రామానికి చెందిన నిరంజన్ అనే వ్యక్తి రెడ్‌మి 3ఎస్. అను స్మార్ట్ పోన్‌ను పట్టణంలోని శ్రీలక్ష్మీనరసింహ్మ మోబైల్ దుకాణంలో కొనుగోల్ చేయాగా ఆపోన్ విలువ 9వేలు ఉండగా  11వేలు  అతని దగ్గర వసూలు చేశారు.

తర్వాత అత ను అన్‌లైన్లో  పోన్ వివరాలు  చూడగా 9వేలు పోన్ ధ ర ఉంది. తర్వాత అతను దుకాణం యాజమానిని త మ దగ్గర తీసుకున్న ఎక్కువ డబ్బులలో  కొంత లాభం తీసుకొని  మిగత డబ్బులు ఇవ్వాలని కోరాగా ఇవ్వను నేను ఇంతే తీసుకుంటానని సమాధానం చేప్పారని నిరంజన్ తెలిపారు. ఇలా పట్టణంలో పలు దుకా ణల లో చాలా మందినుండి వేలాది రూపాయలు వసూ లు చేస్తున్న దుకాణం దారులను సంబందిత అధి కారులు ఒక్క రోజు తనఖీ చేసిన దాఖలు లేవని పలువురు అస హనం వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న వ్యక్తినుండే ఇ లా మోసం చేస్తే  సామన్య ప్రజలనుండి ఎంత వసూ లు చేస్తున్నారో అని పలువురు అశ్చర్యం వ్యక్తం చేస్తు న్నా రు. ఇప్పటికై అధికారులు స్పందించి వెంటనే ఇ లాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు వినియోగ దారులు కోరుతున్నారు.