Saturday, February 4, 2023

ఎస్‌బిఐ, మ్యాజిబ్రిక్స్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ సీల్ ది డీల్ క్యాంపెయిన్

- Advertisement -

State-Bank-of-India-Delhiహైదరాబాద్ : ఎస్‌బిఐ హోం లోన్స్ విభాగం, మ్యాజిబ్రిక్స్ సంయుక్తాధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆన్‌లైన్ సీల్ ది డీల్ ప్రచారం విజయవంతమైనదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) డిప్యూటీ జనరల్ మేనేజర్ సంబంధన్, మ్యాజిక్ బ్రిక్స్ డాట్ కామ్ ఎంల్యాబ్స్ డివిజన్ సేల్స్ అధిపతి రితేష్ మోహన్ తెలిపారు. నగరంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వారు పాల్గొన్నారు. సంబంధన్ మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి డిజిటల్ సృజనాత్మకతను తీసుకువచ్చే ప్రయత్నమే సేల్ ది డీల్ క్యాంపెయిన్ అని తెలిపారు. ఈ మెగా ప్రాపర్టీ పండుగో ఎస్‌బిఐ ఆమోదిత ప్రాజెక్టులు మాత్రమే పాలుపంచుకుంటాయని తెలిపారు. వివిధ నగరాల నుండి ఆన్‌లైన్ క్యాంపెయిన్‌లో అందుబాటులోకి వచ్చిన అనేక ప్రాజెక్టులు దేశ, విదేశీయులు ఉపయోగించుకోవచ్చన్నారు. హోంలోన్స్ ప్రక్రియ, మంజూరు తదితర అన్ని విషయాల్లో పూర్తి డిజిటలీకరణ చేస్తున్నామన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అందరికి గృహ సౌకర్యం కల్పించే దిశగా విస్తరిస్తున్నామని ఆయన తెలిపారు. ఆన్‌లైన్ ప్రాపర్టీ షోలో బిల్డర్లు అందించే ఆకర్షణీయ ఆఫర్లతో పాటు, చెల్లింపులో విరామం తీసుకునే అవకాశమున్న గృహ రుణాలను అందిస్తున్నామన్నారు. గృహ నిర్మాణ సమయంలో, ప్రచార సమయంలో మినహాయింపులను ఇస్తున్నామన్నారు. ఎస్‌బిఐ బ్యాంకు లో ఖాతా ద్వారా జీతం పొందుతున్న తమ ఖాతాదారులు 4,00,000 మంది ఆన్‌లైన్ ప్రాపర్టీ కొనుగోలు కోసం ఇందులో చేరవచ్చని ఆయన తెలిపారు. రితేష్ మోహన్ మాట్లాడుతూ, నోట్ల రద్దు దరిమిలా రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై సడలిన విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు మ్యాజిక్ బ్రిక్స్ కృషి చేస్తుందన్నారు. నాణ్యతలో రాజీపడని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన దాదాపు 200కు పైగా ప్రాజెక్టులు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటితో పాటు వినియోగదా రుల సందేహాలను నివృత్తి చేసే అంశాలను మ్యాజిక్‌బ్రిక్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చిందని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles