Friday, April 26, 2024

పెళ్లిళ్లకు 100 మందికే అనుమతి

- Advertisement -
- Advertisement -

Only 100 people to be allowed at wedding function

హైదరాబాద్ : రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల విషయంపై హైకోర్టులో విచారణ జరిగింది. కోవిడ్ టెస్టులు, చర్యలపై హైకోర్టుకు ఎజి బిఎస్ ప్రసాద్ రిపోర్ట్ సమర్పించారు. మార్చి 7, 11వ తేదీల్లో 20వేల టెస్టులు చేయడంపై హైకోర్టు ఆసంతృప్తి వ్యక్తం చేసింది. సొంతంగా సేరో సర్వేలెన్సు సర్వే చేయడానికి సమయం కావాలని ఏజీ ప్రసాద్ కోర్టును కోరారు. ఆరోగ్య సిబ్బంది వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఉన్నారన్న ఏజీ కోర్టుకు తెలిపారు.

రాష్ట్ర సరిహద్దులు, రైల్వే, బస్‌స్టేషన్‌లో 300 మొబైల్ బస్సులతో టెస్టులు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో పబ్లిక్ గ్యాదరింగ్స్ పై ఆంక్షలు విధించాలని, అంత్యక్రియలు, పెళ్ళిల్లో 100 మందికి మించారదని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు డైలీ బులెటిన్ ఇస్తున్నామని ఏజీ చెప్పారు. రద్దీ ప్రాంతాల్లో, నిర్మాణ ప్రాంతాలు, స్కూల్, వద్ద టెస్టులు పెంచాలని హైకోర్టు సూచించింది. ర్యాపిడ్ టెస్టుల కంటే ఆర్టీపీఆర్ టెస్టులు పెంచాలని ఆదేశించింది. అంతేకాకుండా కేంద్రం విడుదల చేసిన ఎస్‌ఓపీ పాటించాలని, అదనపు వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు సూచించింది. కోవిడ్-19 కేసుల తదుపరి విచారణ వచ్చే నెల ఏప్రిల్‌కి హైకోర్టు వాయిదా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News