Friday, April 19, 2024

హుజూరాబాద్ ప్రచారానికి మిగిలింది 2 రోజులే

- Advertisement -
- Advertisement -

హుజూరాబాద్ ప్రచారానికి మిగిలింది 2 రోజులే

బుధవారంతో ముగియనున్న ఉప ఎన్నిక ప్రచారం
ప్రచారంలో వేగం పెంచిన అభ్యర్థులు
మనతెలంగాణ/హైదరాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరింది. కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. నేడు, రేపటితో ప్రచారానికి తెరపడనుంది. గెలుపు ఓటములకు ఈ రెండు రోజులు కీలకం కానున్నాయి. ఈ సమయంలో అభ్యర్థులు చురుకుగా ఓటర్లను కలుస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలను చుట్టేశారు. ఈ కొద్ది సమయంలో ముఖ్యమైన సంఘాల నాయకులను కలుస్తూ.. వారికి హామీలను గుప్పిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్లతో రోడ్‌షోలను ఏర్పాటు చేయాలని అభ్యర్థులు భావిస్తున్నారు. నిమిషం కూడా వృథా చేయకుండా అభ్యర్థులు షెడ్యూల్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి బుధవారం రాత్రి 7 గంటలకు తెరపడనుంది. కీలక ప్రచారానికి ఇంకా రెండురోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈరెండు రోజులు ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా ఓటర్లను కలిసేలా అభ్యర్థులు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలో పట్టణాలు, పల్లెల్లో ఇంటింటి ప్రచారాలు, సభలు నిర్వహించిన టిఆర్‌ఎస్ పార్టీ చివరి రెండు రోజులు కూడా తమ పార్టీ అభ్యర్థిని గెలుపే లక్షంగా ముందుకు సాగుతోంది.
ప్రచారంలో ముందున్న టిఆర్‌ఎస్
హుజురాబాద్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ప్రచారంలో అందరికంటేముందున్నారు. అభ్యర్థితో టిఆర్‌ఎస్ పార్టీ కీలక నేతలు దాదాపుగా నియోకజవర్గం అంతటా ఇప్పటికే ఇంటింటి ప్రచారం పూర్తి చేశారు. ఈ రెండు రోజులు ముమ్మర ప్ర చారం చేసేలా షెడ్యూల్‌ను సిద్ధం చేసుకున్నారు. టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. టిఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరిస్తూ అన్ని వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌తో పాటు టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి రోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ తమదైన శైలిలో ప్రచా రం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
పకడ్బందీగా హుజురాబాద్ ఉప ఎన్నిక
హుజురాబాద్ ఉప ఎన్నికను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ఈ నెల 30వ తేదీతో పోలింగ్ జరుగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ హుజురాబాద్ ఉపఎన్నికపై కరీంనగర్, హనుమకొండ కలెక్టర్లు, పోలీసుల అధికారులతో పోలింగ్, ఎన్నికల ఏర్పాట్లపై రెగ్యులర్‌గా సమీక్షిస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి ఓటర్‌కు పోలింగ్ స్టేషన్‌లో కల్పించాల్సిన సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, వీల్ ఛైర్లు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వెబ్ కాస్టింగ్, వీడియో చిత్రీకరణ, సీసీ కెమెరాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నియమావళి, నిబంధనలు, కొవిడ్ దృష్ట్యా ప్రభుత్వ మార్గదర్శకాల అమలుపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికపై ఈనెల 27న కరీంనగర్, హనుమకొండ కలెక్టర్లు, పోలీసుల అధికారులతో మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు.

Only 2 days for Election Campaign in Huzurabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News