Home జాతీయ వార్తలు మోడీ మాటలు, ఆప్‌చేతలు రెండు ఢిల్లీలు!

మోడీ మాటలు, ఆప్‌చేతలు రెండు ఢిల్లీలు!

APPగత ఏడాది మార్చిలో భారతీయ ప్రజాస్వామ్యంపై చైనా అధికార వార్తా సంస్థ జిన్ హువా విమర్శలు గుప్పించింది. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బిజెపి లను ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మట్టికరి పించిన సందర్భం అది. భారత ప్రజాస్వామ్యంలో ఎన్ని కల ప్రక్రియ కేవలం అధికార మార్పిడికి, పంపిణీకి తప్ప మరి దేనికీ ఆలంబన కాదని జిన్ హువా వాఖ్యానిం చింది. ప్రపంచంలోని పేదల్లో 20 శాతం మంది నివ సించే దేశంగా భారత్‌ను పేర్కొంటూ, చైనా కనుక ప్రజా స్వామ్యాన్ని అనుసరించి ఉంటే మరో భారత్ అయ్యేదని వ్యంగ్యం కూడా గుప్పించింది జిన్ హువా.
భారతీయ ప్రజాస్వామ్యం వెక్కిరింతకు గురైనది అదే మొదటిసారి కాదు. సింగపూర్‌కు చెందిన లీ కువాన్ ఒకసారి చేసిన వ్యాఖ్య అందరికీ తెలిసినదే. ‘భారతీయు లు మాట్లాడతారు. చైనా వారు చేసి చూపిస్తారు’ అన్నా రాయన. దేశీయంగా కూడా మన ‘ఏకాభిప్రాయ ఆధా రిత విధాన నిర్ణయ వ్యవస’్థను చాలామంది విశ్లేషకులు, ఆర్థికవేత్తలు పెద్ద అడ్డంకిగా తప్పుపట్టారు. ‘చైనాను ఆద ర్శంగా పెట్టుకొంటానని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు మదుపరుల సమాశేశంలో అన్నారు.
మోడీది ఏకస్వామ్యం
ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోడీ తల కిందులు విధానాలను, ఏకస్వామ్య పాలనను ప్రవేశ పెట్టారు. ఇటీవలి కాలంలో ఏ ప్రధాని చేయని విధంగా మోడీ ఎక్కువ అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకొన్నా రని ‘ఎకనామిస్ట్’ పత్రిక రాసింది. సమస్య ఏమిటంటే- భారత్ పరిణామ క్రమంలో వచ్చే పాలనా పరమైన పరి వర్తనను కోరుతోంది. ఈ కోణంలో చూస్తే ఒక్కడు, అతని పరివారం చేతిలో అధికారం కేంద్రీకృతమైతే చేయవల సిన పని పెను భారమవుతుంది. పార్లమెంటరీ ప్రజాస్వా మ్యం పట్ల మోడీ ఏమాత్రం గౌరవం చూపలేదు. ఆయన ఏడాదిన్నర పాలన కూడా పూర్తవకముందే డజను దాకా ఆర్డినెన్స్‌లు జారీచేశారు. బిజెపియేతర పార్టీలు అధికా రంలో ఉన్న రాష్ట్రాలలో ఎన్‌డిఎ నియమించిన గవర్నర్లు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన ప్రభుత్వాలను పట్టాలు తప్పించడానికి కేంద్రం పురమాయింపుపై ప్రయత్ని స్తున్నారు. ప్రజల నుంచి విధేయత, విశ్వాసం కోరుకొనే మోడీ నమూనా పాలనకు పూర్తి వ్యతిరేకంగా ఢిల్లీలో అర వింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యం గల, వైవిధ్య భరితమైన, వికేంద్రీకృత పాలనను చవి చూపిస్తోంది.
ఆప్ విజయాలు అనేకం
ఢిల్లీ ప్రభుత్వ విజయాల జాబితా పొడవైనది. అయినా ఆ వార్తలు అంతగా మీడియాలో అగుపడలేదు. 2015 ఫిబ్ర వరి నుంచి ఆప్ ప్రభుత్వం నీటి సరఫరాను, విద్యా ప్ర మాణాలను పెంచింది, ప్రజా సేవలను మెరుగుపరి చింది, వైద్య-ఆరోగ్య రంగాల్లో పరిస్థితులను చక్కబరి చింది, విద్యుత్ టారిఫ్‌ను అందుబాటులోకి తెచ్చింది. రెడ్ టేపిజాన్ని కత్తిరించి, ప్రభుత్వంతో అయ్యే పనులకు ప్రక్రియను సులభతరం చేసింది. ఢిల్లీ రోడ్లపై కార్ల రద్దీని తగ్గించడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా ‘సరి సంఖ్య, బేసి సంఖ్య ’ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ పద్ధతి తోనే ఆప్ తరహా పాలనపై దేశం దృష్టి మొదటిసారి పడింది. ఆప్‌పై ఇంతవరకూ ఒకే ఒక విమర్శ వినపడేది. అదేమిటంటే- ఆందోళనలు, ఉద్యమాలు చేయడం తప్ప పరిపాలన దానికి చేతకాదన్నది. కేజ్రీవాల్, ఓ హడావిడి మనిషని, పెద్ద ప్రాజెక్టులను రూపొందించి అమలు పరచ డం ఆయనకు తెలియదని అనుకునేవారుకూడా. ‘సరి, బేసి సంఖ్య విధానం అనూహ్య విజయంతో ఆ విమర్శ లకు ఇక చేటు లేకుండాపోయింది. తకువ కాలం పాటు నొప్పి కలిగించినా దీర్ఘకాలం సత్ఫలితాలిచ్చే రకం విధానపరమైన నిర్ణయాలు తీసుకోడానికి రాజకీయ అధి కార గణం తటపటాయిస్తుంది. ఇబ్బందికరం అనిపించే నిర్ణయాల బాధ్యతను న్యాయ వ్యవస్థకు వదిలిపెడతారు. సిఎన్‌జి బస్సు లను ప్రవేశపెట్టడానికి వీలుగా డీజిల్ బస్సులను నిషేధించడం కానీ, ఢిల్లీ లోకి ప్రవేశించే ఇతర వాహనాలపై పర్యావరణ పరిహార చార్జీల విధిం పుగాని, దేశ రాజధాని నుంచి కాలు ష్య పరిశ్రమల తరలింపు గాని- అసౌకర్య నిర్ణయాలను తీసుకొనే బాధ్యతను ఉన్నత స్థాయి న్యాయవ్యవస్థకే విడిచిపెట్టడం మన పాలకు లు అనుసరించే అనవాయితీ. ముఖ్యంగా పౌర పరిపా లన మెరుగునకు చేపట్టే ఏ చర్యకయినా అదే దారి.
ఈ దేశం ఎన్నడూ చూడని పట్టణ ప్రాంతపు తీవ్ర విధానపరమైన నిర్ణయం సరి, బేసి సంఖ్యల విధానం. ఈ విధానంతో అంతటా అరాచకం, అస్తవస్త పరిస్థితులు నెలకొంటాయని కొందరు పెదవివిరుపు నేతలు ఊహిం చారు. కానీ, వారి ఊహలు వమ్ము చేస్తూ, ఆ విధానం ఆశించిన ఫలితాన్ని అందించింది. ‘ఆందోళనలు, ధర్నా ల పార్టీ’ ఈ పథకాన్ని ప్రజల ఉద్యమంగా కేవలం నెల రోజులలో మార్చేసింది. సమావేశాల పరంపర, రేడి యో-వార్తా పత్రికలలో విజ్ఞప్తులు చేయడం, సంబంధిత వ్యక్తులతో చర్చలు సాగించడం ద్వారా కేజ్రీవాల్ ఆ పథకాన్ని ఉద్యమంగా అనతికాలంలో తీర్చి దిద్దారు. ఆప్ ప్రభుత్వం తీసుకొన్న కాలుష్య వ్యతిరేక నిర్ణయాల్లో గుర్తుంచుకోదగ్గవి ఎన్నో ఉన్నాయి.
‘సాహసోపేత నిర్ణయాలను మన వ్యవస్థ తీసుకోకపోతే దానికి మన ప్రజాస్వామ్య వ్యవస్థది కాదు తప్పు- మన చిత్తశుద్ధి లేని రాజకీయ పార్టీలు, నాయకులది.. వాటి సంకుచిత ఓటు బ్యాంకు ఆలోచనలది’ అనే గొప్ప సందే శాన్ని కేజ్రీవాల్ చర్యలు చాటిచెప్పాయి. మంచి పాలనకు ఏకాభిప్రాయాన్ని రూపుదిద్దుకోనివ్వడం, సామాన్య మానవులకు సాధికారత కల్పించడం, అధికారాలను వికేంద్రీకరించడం అత్యవసరమని ఆప్ అచరణ ద్వారా నిరూపించింది. ఆశించిన మార్పుల ఆవిష్కరణ కోసం పాలనలో పారదర్శకత, ప్రజలకు భాగస్వామ్యం కల్పిం చడం అసలు లక్షాలు కావాలని కూడా ఆప్ నిరూపించింది.
స్వచ్ఛ భారత్ – ఓ ఖరీదైన వ్యవహారం
ఆప్ ఇటీవల చేపట్టిన ‘స్వచ్ఛ ఢిల్లీ’ పథకం ఫలితాన్ని , ప్రధాని మోడీ ‘స్వచ్ఛ భారత్’ పథకం ఫలితంతో పోల్చితే ఆప్ పాలన పురోగమనం అర్థమవుతుంది. నవంబర్ 16న ఢిల్లీ ప్రభుత్వం ‘స్వచ్ఛ ఢిల్లీ’ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఆ యాప్‌ను వాడుకొని తమ పరిస రాల్లోని చెత్త – చెదారం దృశ్యాలను అప్‌లోడ్ చేయండని ఢిల్లీ పౌరులను కోరింది. ఈ కార్యక్రమం సాగిన నెల రోజుల్లో సుమారు లక్ష దాకా దృశ్యాలు అప్‌లోడ్ అయ్యాయి. మరో 50,000దాకా ఫిర్యాదులు అందా యి. వాటి పట్ల ప్రభుత్వం తగిన విధంగా స్పందించి పౌరులకు సంతృప్తిని కలిగించింది. కొన్ని కోట్ల రూపా యల ఖర్చుతో ఈ మొత్తం వ్యవహారాన్ని మూడు కార్పొ రేషన్ల పిడబ్లుడి సిబ్బంది ఉమ్మడిగా చక్కదిద్దుకు వచ్చా రు. మరోపక్క నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ ఉద్యమం కేవలం నినాదాలకు, ప్రచార ఫొటోలకు, గొప్పలు చెప్పుకోడానికి మాత్రమే పరిమితమైంది. జూలై 15 దాకా మోడీ ప్రభుత్వం ఈ పథకం కోసం ఖర్చు పెట్టినది అక్షరాలా రూ.100 కోట్లు. ఇది పత్రికలు, రేడియో, టీవీల్లో ప్రచారానికి అయిన ఖర్చు. స్వచ్ఛ భారత్ అభి యాన్‌కు ఈ ఖర్చు ద్వారా కలిగిన ప్రయోజన మేమిటో తెలియదు. కనీసం ముందు చెప్పినట్లుగా ఆ పథకం దేశమంతటా సమగ్ర స్వచ్ఛతను తెచ్చేది కూడా కాదు. ఇప్పుడు దానిని కేవలం మరుగుదొడ్ల నిర్మాణానికి కుదిం చారు. దీనికి మొత్తం కేటాయిం పులు కళ్లు తిరిగేలా రూ.రెండు లక్షల కోట్లు. ఈ పథకం కింద అధి కారాలన్నీ పెద్ద సంఖ్యలో గల అధికార గణానికి అప్పగించారు. గరిష్ఠ, కనిష్ట పాలన కబు ర్లు చెబుతూ ఇంత తేడా కనబరుస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై వేర్వేరు వాఖ్యలు ఎప్పుడూ ఉంటాయి. కాని ఢిల్లీ ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు – పాలనలో నికార్సుగా ఉండటాన్నే కోరుతున్నామని. పరిణామ క్రమంలో వచ్చే పరివర్తనను వారు ఆశిస్తున్నారు. మార్పు లో ప్రజలకు ప్రమేయాన్ని కూడా కోరుతున్నారు. మోడీ ఏకస్వామ్యానికిది సరిపడదు. ఆప్ దారిలోనే ముందుకు సాగడం సాధ్యం అన్న అవగాహన ఇప్పుడు పెరుగుతోంది.