Tuesday, March 21, 2023

ఆదర్శ పాఠశాలలో అయ్యో పాపం..కుళ్లిన కూరగాయల భోజనం

- Advertisement -

 

vagetables

= ఆదర్శ పాఠశాలలో అధ్వాన మధ్యాహ్న భోజనం
= కుళ్లిపోయిన కూరగాయలు, పాచి అన్నం
= బినామీ వంటకాలు
= పట్టించుకోని వైనం

మనతెలంగాణ/ డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వాన్న స్థితికి చేరింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న ప్రైవేట్ నిర్వాహకులు బినామి పేర్లతో నిర్వహిస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మధ్యాహ్న భోబోజనం పథకానికి గంగాధర్, సరస్వతిలు రోజు వంటలు చేసి విద్యార్థులకు అందిస్తున్నారు. కానీ గత కొంత కాలంగా ఈ పాఠశాలలో కుళ్లిపోయిన కూరగాయలు, పాచిఅన్నం విద్యార్థులకు తినిపిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఖిల్లా డిచ్‌పల్లికి చెందిన రాకర్‌స్టార్ యూత్, భజరంగ్‌దళ్ యూత్ స్టార్, గ్రామ యువకులు కలిసి ఆదర్శ పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన వంటలను పరిశీలించారు. కుళ్లిపోయిన అన్నం, పురుగులు పడుతున్న కూరగాయలతో వంటలు చేసి పెడుతున్నారు.
ఏజెన్సీ నిర్వహకులు వండి పెట్టాల్సింది పోయి బినామి వ్యక్తులతో వంటలు వండించి విద్యార్థులకు భోజనాలు పెడుతున్నారని ఈ విషయం మాడల్ స్కూల్, మిడ్‌మిల్స్ ఇంచార్జ్ అధ్యాపకురాలు భారతి దృష్టికి ఇంచార్జ్ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. గత మూడు నెలలుగా బినామీ వ్యక్తులతో కొనసాగిస్తున్నారని, మంచి కూరగాయలు, మంచినూనెతో వంటలు చేయమని పలుమార్లు సూచించిన పట్టించుకోవడం లేదని అధ్యాపకులు తెలిపారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్, ఎంపిడిఓ, ఎమ్మార్వోకు ఫిర్యాదు చేస్తామని కాంట్రాక్ట్ రద్దు చేయిస్తామని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే సహించేలేదని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles