Home టెక్ ట్రెండ్స్ అమెజాన్‌లో ఒప్పో ఎఫ్11 ప్రొ

అమెజాన్‌లో ఒప్పో ఎఫ్11 ప్రొ

Oppo F11 Pro 128GB Storage Variant

 

ముంబయి: ప్రముఖ మొబైల్స్ తయారీదారు ఒప్పో తన కొత్త ఎఫ్11 ప్రొ స్మార్ట్‌ఫోన్ కు చెందిన 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ అమెజాన్ లో అమ్మకాలను ప్రారంభించింది. దీంట్లో 6.53 ఇంచుల భారీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెస‌ర్‌ ను అమర్చారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 48 మెగాపిక్సల్ ప్రాధమిక సెన్సర్ కెమెరాలు రెండింటిని వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. రేడియెంట్ మిస్ట్, ఎమరాల్డ్ గ్రీన్ వేరియెంట్లలో ఈ ఫోన్ రిలీజ్ కాగా ఈ ఫోన్‌కు చెందిన 6జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఈ ఫోన్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌తో రూ. 25,990 ధరకు కస్టమర్లకు లభిస్తుంది.

ఒప్పో ఆర్‌ఎక్స్17 ప్రొ అద్భుత ఫీచర్లు…

6.53 ఇంచ్ డిస్‌ప్లే, (1080 x 2340 పిక్సెల్స్) ఎల్ సిడి స్క్రీన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెసర్, 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 48 మెగాపిక్సల్ ప్రాధమిక సెన్సర్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.

Oppo F11 Pro 128GB Storage Variant Sale in Amazon