Home తాజా వార్తలు టీమిండియాకు కొత్త జెర్సీ

టీమిండియాకు కొత్త జెర్సీ

Team India

ఒప్పోకి బదులు బైజుస్‌తో ఒప్పందం
ముంబై: భారత క్రికెట్ జట్టుకు త్వరలో కొత్త జెర్సీ రానుంది. ఇప్పటి వరకు టీమిండియా జెర్సీలకు బ్రాండ్‌గా వ్యవహరించిన ఒప్పోకి బదులు కొత్త సంస్థతో భారత క్రికెట్ బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపై టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై ఒ ప్పో బ్రాండ్‌కు బదులు త్వరలో కొత్త బ్రాండ్ దర్శనమివ్వబోతోంది. వెస్టిండీస్ పర్యటన వరకే టీ మిండియా జెర్సీలపై ఒప్పో బ్రాండ్ దర్శనమిస్తోం ది. సెప్టెంబర్ 15న ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటన నుంచి భారత్‌కు కొత్త జెర్సీలు అందుబాటులో రానున్నాయి. బెంగళూరుకు చెందిన ఆన్‌లైన్ ట్యుటోరియల్ సంస్థ బైజుస్ తన బ్రాండ్‌ను కొనసాగించనుంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో.. 2017 మార్చిలో టీమిండియా స్పాన్సర్‌షిప్‌ను రూ.1079 కోట్లకు ఐదేళ్ల పాటు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్ల పత్రిక తెలిపిన వివరాల ప్రకారం.. ఒప్పో సంస్థ తమ స్పాన్సర్‌షిప్‌ను రద్దు చేసుకుందని, 2017లో అధిక వ్యయానికి ఒప్పందం కుదుర్చుకున్నామనే కారణంతో తప్పుకోవాలని చూస్తోందట. అంత మొత్తంలో తాము చెల్లించలేమనే ఒప్పో వైదొలుగుతున్నట్లు పేర్కొంది. అయితే బైజుస్ సంస్థ అదే కాల వ్యవధికి అంతే మొత్తంలో బీసీసీఐకి చెల్లించడానికి ముందుకు వచ్చిందని, దీంతో సెప్టెంబర్ నుంచి 2022 మార్చి వరకు బైజుస్ స్పాన్సర్‌షిప్ చేస్తుందని తెలిపింది. కాగా టీమిండియా ఆడే ద్వైపాక్షిక మ్యాచ్‌లకు ఒప్పో సంస్థ ఒక్క రోజుకు రూ 4.61 కోట్లు చెల్లించగా ఐసిసి టోర్నమెంట్లకు రూ.1.56 కోట్లు చెల్లించేది.

 Oppo is discontinuing sponsorship of Indian cricket team