Home టెక్ ట్రెండ్స్ సూపర్ ఫీచర్స్ తో ఒప్పో నయా స్మార్ట్‌ఫోన్స్

సూపర్ ఫీచర్స్ తో ఒప్పో నయా స్మార్ట్‌ఫోన్స్

oppo
న్యూఢిల్లీ: ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ ఒప్పో న్యూ ఫీచర్లతో రెండు నయా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఆర్ఎక్స్ 17 ప్రొ, ఆర్ఎక్స్ 17 నియో పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్లను యూరప్‌లో లాంచ్ చేసింది. కాగా, ఒప్పో ఆర్ఎక్స్ 17 ప్రొ 6జిబి ర్యామ్/128 జిబి స్టోరేజీ వెర్షన్ ధర భారత కరెన్సీలో దాదాపు రూ.49,800. ఇక ఒప్పో ఆర్ఎక్స్ 17నియో 4జిబి ర్యామ్/128 జిబి స్టోరేజీ వేరయంట్ ధర దాదాపు రూ.29 వేలుగా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 16 నుంచి ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. వాటర్ డ్రాప్ షేప్‌డ్ నాచ్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ఫ్రింట్ స్కానర్, 25 మెగాపిక్సల్ ఎఐ ఫ్రంట్ కెమెరా తదితర ఫీచర్లను కలిగి ఉన్నాయి.
ఫీచర్స్ :
ఒప్పో ఆర్ఎక్స్ 17 ప్రొ :
6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఓఎస్,3,700 ఎంఎహెచ్ బ్యాటరీ, డ్యూయల్ నానో సిమ్‌ స్లాట్లు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, స్నాప్ డ్రాగన్ 710 ఆక్టాకోర్ ప్రాసెసర్, 12+20 మెగాపిక్సల్ కెమెరా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ (టిఒఎఫ్) 3డీ సెన్సింగ్ కెమెరా సెటప్, ముందువైపు 25 మెగాపిక్సల్ కెమెరాతోపాటు వెనకవైపు మూడు కెమెరాలు ఈ ఫోన్ ప్రత్యేకత.
ఒప్పో ఆర్ఎక్స్ 17 నియో : డ్యూయల్ నానో సిమ్, స్నాప్‌డ్రాగన్ 660 ఆక్టాకోర్ ప్రాసెసర్, 16+2 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఓఎస్, 3,600 ఎంఎహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి.
Oppo neo smartphones with super features