Thursday, April 25, 2024

ఫార్మా, లైఫ్ సైన్స్ రంగానికి అవకాశాలు ఎక్కువ: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Opportunities in Pharma Life Science industry

 

హైదరాబాద్: కరోనా సంక్షోభ సమయంలో హైదరాబాద్ ఫార్మా రంగాన్ని తన బలాన్ని మరోసారి చాటుకుందని మంత్రి కెటిఆర్ కొనియాడారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన వెబినార్‌లో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. ప్రస్తుత సంక్షోభంలో ఫార్మా, లైఫ్ సైన్స్ రంగానికి అవకాశాలు ఉన్నాయన్నారు. సంక్షోభం తరువాత కూడా ఫార్మా, లైఫ్ సైన్స్ రంగాల్లో అద్భుత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుందని వివరించారు. జోనోమ్ వ్యాలీ, మెడికల్ డివైసెస్ పార్క్, హైదరాబాద్ ఫార్మా సిటీ వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా నిలువబోతుందని కెటిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News