Friday, March 29, 2024

టిక్‌టాక్‌తో ఒరాకిల్-వాల్‌మార్ట్ డీల్

- Advertisement -
- Advertisement -

టిక్‌టాక్‌తో ఒరాకిల్-వాల్‌మార్ట్ డీల్
తాజా ప్రతిపాదనకు ట్రంప్ ఓకె

వాషింగ్టన్: అమెరికా కంపెనీలు ఒరాకిల్, వాల్‌మార్ట్‌లు టిక్‌టాక్‌తో ఒప్పందం కుదుర్చుకునే ప్రతిపాదనకు ప్రెసిడెంట్ ట్రంప్ మద్దతు పలికారు. భద్రతా కారణాలతో అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం విధించారు. అత్యంత ఆదరణ పొందిన చైనాకు చెందిన ఈ టిక్‌టాక్ యాప్ అమెరికా కార్యకలాపాల నిర్వహణకు వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి. ముందుగా ఈ దిశలో వచ్చిన మైక్రోసాఫ్ట్ తరువాత వెనకకు వెళ్లింది. ఇప్పుడు ఒరాకిల్, వాల్‌మార్ట్‌ల ప్రమేయంతో టిక్‌టాక్ డీల్‌ను ట్రంప్ స్వయంగా ప్రతిపాదించారు. టిక్‌టాక్‌తో ఈ కంపెనీల ఒప్పందం పూర్తి స్థాయిలో కుదిరితే ఈ చైనా వీడియో కార్యకలాపాలు అమెరికాలో నిరాటంకంగా సాగుతాయి. అయితే ట్రంప్ తమ ప్రతిపాదనలో కొన్ని షరతులు పెట్టారు. దీని మేరకు ఈ రెండు సంస్థలు ఓ కొత్త కంపెనీని ఏర్పాటు చేసుకోవాలి. దీనిని టెక్సాస్‌లో నెలకొల్పాలి. పాతికవేల మందికి ఉద్యోగాలు కల్పించాలి.

ఇక టిక్‌టాక్ సంస్థ వారు అమెరికా యువత విద్యావకాశాలకు 5 బిలియన్ డాలర్ల సాయం అందించాల్సి ఉంటుంది. ప్రెసిడెంట్ ట్రంప్ గత నెలలోనే టిక్‌టాక్ నిషేధపు కార్యనిర్వాహక ఉత్తర్వులు వెలువరించారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ నెల 27వ తేదీ నుంచి టిక్‌టాక్, వీ చాట్ యాప్‌ల పూర్తి స్థాయి నిషేధానికి ట్రంప్ ఇప్పుడు ఉత్తర్వులు వెలువరించారు. ముందు నిర్ణయించిన ప్రకారం ఈ నిషేధం ఇందులో భాగంగా డౌన్‌లోడ్‌ల నిలిపివేతలు ఆదివారం నుంచే అమలులోకి రావాలి. దీనిని వారం రోజులు వాయిదా వేశారు. ఈ దశలోనే టిక్‌టాక్‌తో వాల్‌మార్ట్, ఒరాకిల్ ఒప్పందానికి ట్రంప్ తీవ్రంగా యత్నిస్తున్నారు. ఒప్పందం కుదిరేందుకు సానుకూలత దిశలోనే ఇప్పుడు నిషేధ గడువును పెంచినట్లు వెల్లడైంది.

Oracle and Walmart deal with TikTok

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News