Home తాజా వార్తలు శ్వాసలో తాజాదనం కావాలంటే…

శ్వాసలో తాజాదనం కావాలంటే…

 Cardamom

 

ఒక సుగంధద్రవ్యంగా యాలకలతో నోటి దుర్వాసనను అరికట్టవచ్చు. శ్వాసలో తాజాదనాన్ని నింపవచ్చు. నోట్లో ఒక యాలకుల పలుకువేసుకుని సాధారణంగా చాలామంది ఆ ప్రయోజనాన్ని పొందుతుంటారు. నిజానికి ఈ చిన్న పనులతో పాటు ఆరోగ్యపరంగా ఎంతో పెద్ద ప్రయోజనాలు ఇస్తాయి యాలకులు. వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని.
* యాలకులు జీవక్రియలను వేగవంతం చేస్తాయి. జీర్ణరసాల స్రావాలను ప్రేరేపించడం ద్వారా అవి మంచి జీర్ణక్రియకు తోడ్పడతాయి.
* యాలకులు జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక రుగ్మతలను… అంటే యాసిడ్ పైకి తన్నడాన్ని (యాసిడ్ రిఫ్లెక్స్), ఛాతీలో మంట, డయేరియా వంటి వాటిని అరికడతాయి.
* వీటిలోని యాంటీఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గిస్తాయి. తద్వారా గుండెకు మేలు చేస్తాయి.

* యాలకులలోని యాంటీఆక్సిడెంట్స్ ప్రమాదకరమైన ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. యాలకుల పౌడర్‌ను ఉపయోగిస్తూ చేసిన ఔషధాలు క్యాన్సర్ గడ్డలను కరిగించగలవని కొన్ని అధ్యయనాల్లో స్పష్టంగా తేలింది.
* ఆస్తమాలో కనిపించే పిల్లికూతలు, దగ్గు, ఛాతీ పట్టేసినట్లు ఉండటం వంటి ఎన్నో రకాల సమస్యలను యాలకులు తేలిగ్గా పరిష్కరిస్తాయి. ఊపిరితిత్తుల నిండా గాలిని ధారాళంగా పీల్చుకునేందుకు ఇవి దోహదపడతాయి. ఊపిరితిత్తుల్లోని ఇన్‌ఫ్లమేషన్‌ను నివారిస్తాయి.

* శారీరక సమస్యలకే కాదు… మానసిక సమస్యల పరిష్కారంలోనూ యాలకులు బాగా తోడ్పడతాయి. క్రమం తప్పకుండా యాలకులు వాడితే అవి డిప్రెషన్‌ను దూరం చేస్తాయని అధ్యయనాల్లో తేలింది.
* డయాబెటిస్‌ను నివారించడంలో లేదా డయాబెటిస్‌ను ఆలస్యం చేయడంలో యాలకుల భూమిక చాలా విశిష్టమైనది.
* యాలకులు రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి.
* రక్తంలోని గడ్డలను (క్లాట్స్‌ను) నివారించడం ద్వారా అవి రక్తప్రసరణ సాఫీగా అయ్యేలా చూస్తాయి. తద్వారా గుండెపోటును, పక్షవాతాన్ని నివారిస్తాయి.
* అనేక రకాల చర్మసమస్యలను దూరం చేస్తాయి. మేనిలో మంచి నిగారింపును తెస్తాయి.

Oral odor can be cured with Cardamom