Friday, April 19, 2024

వైద్య సిబ్బందిపై దాడి చేస్తే ఏడేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

Medical personnel

 

లక్షనుంచి రూ.5 లక్షల దాకా జరిమానా
బెయిలుకు అవకాశం లేని కేసులు
ఆస్తినష్టం కలిగిస్తే రెట్టింపు వసూలు
కఠిన ఆర్డినెన్స్‌కు కేంద్రమంత్రివర్గం
ఆమోదం n కరోనా వారియర్స్‌కు
రూ.50 లక్షల ఆరోగ్య బీమా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై యావద్దేశం పోరాటం చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణ యం తీసుకుంది. ఇటీవలి కాలంలో వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణిస్తూ ఓ ఆర్డినెన్స్‌ను తీసుకు రావాలని నిర్ణయించింది. ఇకపై కరోనాపై పోరాడుతు న్న వైద్య సిబ్బందిపై ఎవరైనా దాడులకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కే సులు నమోదు చేసి గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఈ మేరకు 1987 నాటి అంటు రోగాల చట్టానికి సవరణ చేస్తూ తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ విలేఖరులకు తెలియజేశారు.‘ కోవిడ్‌పై పోరాటం చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, ఈ రంగంలోని వారికి దేశం యావత్తు సెల్యూట్ చేస్తూ ఉంటే వాళ్లే ఈ వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారని భావించి వారిపై కొందరు దాడులు చేస్తున్నారు’ అని జవడేకర్ అన్నారు.

కరోనానుంచి దేశాన్ని కాపాడుతున్న వైద్య సిబ్బందిపై దాడులు జరగడం హేయమని ప్రకాశ్ జవడేకర్ అన్నారు. ఇకపై అలాంటివి జరిగితే సహించేది లేదన్నారు. ఇందుకోసం కఠిన నిబంధనలతో ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చినట్లు చెప్పారు. వైద్యులపై దాడులకు పాల్పడిన వారిపై కేసు తీవ్రతను బట్టి ఆరు నెలలనుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని, లక్ష రూపాయలనుంచి రూ.5 లక్షల దాకా జరిమానా విధిస్తామని ఆయన చెప్పారు. దాడి సమయంలో వైద్య సిబ్బందికి సంబంధించిన వాహనాలు, ఆస్పత్రికి సంబంధించి ఏదైనా ఆస్తి నష్టం జరిగితే మార్కెట్ విలువ ప్రకారం లెక్కగట్టి అంతకు రెట్టింపు మొత్తాన్ని నిందితులనుంచే వసూలు చేస్తామని తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఆర్డినెన్స్ అమలులోకి రానుందని చెప్పారు. క్లిష్ట సమయంలో వైద్యులు, ఆశావర్కర్లు, పారిశుద్ధ సిబ్బంది దేశానికి ఎనలేని సేవ చేస్తున్నారని జవడేకర్ కొనియాడారు. కాబట్టి కరోనా విధుల్లో ఉన్న అందరికీ రూ.50లక్షల వరకు వైద్యబీమా సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. కోవిడ్19 బాధితులకు ఆయుష్మాన్ భారత్ కింద చికిత్స అందించనున్నట్లు చెప్పారు.

వైద్య సిబ్బందికి అమిత్‌షా హామీ
ఇదిలా ఉండగా కోవిడ్19పై పోరులో ముందున్న వైద్యులు, వైద్య సిబ్బందిని హోంమంత్రి అమిత్‌షా ప్రశంసించారు. వైద్య సిబ్బందికి ఎటువంటి హానీ కలగకుండా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ మేరకు ఆయన బుధవారం భారత వైద్య సంఘం (ఐఎంఎ) ప్రతినిధులు, వైద్య బృందాలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎలాంటి నిరసనలకు దిగొద్దని కోరారు. ప్రభు త్వం వైద్యులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దీంతో వైద్యులు ఆందోళన ఆలోచనను విరమించారు.
వైద్యులు, వైద్య సిబ్బంది రక్షణ కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు ఆ శాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. వైద్య సిబ్బందికి రక్షణ కల్పించడం రాష్ట్రప్రభుత్వ బాధ్యత అని కూడా స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నివారణలో పాల్గొంటున్న వారికి ఆటంకం కల్పిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో సూచించింది. ప్రతి రాష్ట్రప్రభుత్వం వైద్య సిబ్బంది రక్షణకు ఒక నోడల్ అధికారిని నియమించాలని హోం శాఖ కోరింది.

ఆరోగ్య సిబ్బంది భద్రతకే ఆర్డినెన్స్ : మోడీ
కోవిడ్‌పై ధైర్యంగా పోరాడుతున్న ప్రజల ఆరోగ్య రక్షణ సిబ్బందిపై జరిగే హింసాత్మక దాడుల్ని నివారిం చేందు కు, వారికి భద్రత కల్పించేందుకు ఆర్డినెన్స్ తెచ్చామని ప్రధానమంత్రి మోడీ బుధవారం చెప్పారు. ‘ముందు వరసలో ఉండి కోవిడ్ 19పై సాహ సోపేతంగా పోరాడుతున్న ప్రతి ఆరోగ్య రక్షణ కార్యకర్తకు రక్షణ కల్పించాలన్న మన సంకల్పాన్ని అంటువ్యాధుల (సవరణ) ఆర్డినెన్స్ 2020 స్పష్టం చేస్తున్నది. ఇది మన వైద్య ఉద్యోగులకు భద్రత కల్పిస్తుంది. వారి భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదు’ అని వివరించారు.

 

Ordinance on attack on Medical personnel
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News