Saturday, April 20, 2024

ఆస్కార్ అవార్డు గ్రహీత భాను కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Oscar Award Recipient Bhanu Passed away

ముంబై : ఆస్కార్ అవార్డును గెల్చుకున్న తొలి భారతీయురాలు, కాస్టూమ్ డిజైనర్ భాను అతయ్య (91) గురువారం సుదీర్ఘ అనారోగ్యంతో స్వగృహంలో కన్నుమూశారు. 1983లో రిచర్డ్ అటెన్‌బరో నటించిన గాంధీ చిత్రంలో విశేష ప్రావీణ్యంతో ఆమె పనిచేసినందుకు ఆమెకు ఉత్తమ కాస్టూమ్ డిజైనర్‌గా ఆస్కార్ అవార్డు లభించింది. ఎనిమిదేళ్ల క్రితం ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఒకవైపు పక్షవాతం రావడంతో గత మూడేళ్లుగా ఆమె మంచం పట్టారని కుమార్తె రాధికా గుప్త చెప్పారు. కొల్లాపూర్‌లో జన్మించిన అతయ్య 1956 లో గురుదత్ హిందీ చిత్రం సిఐడిలో తన కెరీర్ ప్రారంభించి దాదాపు 100 చిత్రాలకు కాస్యూమ్ డిజైనర్‌గా గత ఐదేళ్ల వరకూ పనిచేశారు. భద్రత కోసం ఆమె 2012 లో తన ఆస్కార్ అవార్డును అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్ అండ్ సైన్సెస్‌కు తిరిగి ఆప్పగించారు. ఇదే విధంగా గతంలో ఆమె గాంధీకి సంబంధించిన విలువైన పత్రాలను అకాడమీకి అప్పగించారు.

Oscar Award Recipient Bhanu Passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News