Friday, March 29, 2024

ఆస్కార్ అవార్డుల పంట

- Advertisement -
- Advertisement -

Oscar awards

 

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఆస్కార్ అవార్డుల వేడుక అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అవార్డుల వేడుకలో హాలీవుడ్ స్టార్స్, టాప్ ఫిల్మ్‌మేకర్స్, ప్రముఖ టెక్నీషియన్స్ పాల్గొని సందడి చేశారు. పలువురు అందాల తారలు వయ్యారాలు ఒలకబోసి కనువిందు చేశారు. తారల తళుకుబెళుకుల మధ్య ఆస్కార్ అవార్డుల వేడుక ఆద్యంతం ఉల్లాసంగా… ఉత్సాహంగా కొనసాగింది. కాగా ఈ ఆస్కార్ వేడుకలో ఓ సంచలనం నమోదైంది. ఆస్కార్ చరిత్రలోనే మొదటిసారి ఓ ఆంగ్లేతర సినిమా ఉత్తమ చిత్రంగా నిలవడం విశేషం. దక్షిణ కొరియా మూవీ ‘పారాసైట్’ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఉత్తమ దర్శ కుడిగా ‘పారాసైట్’ దర్శకుడు బోన్ జోన్ హో అవార్డును అందు కున్నారు. ఇక ‘జోకర్’లో నట నకుగాను జోక్విన్ ఫీనిక్స్ ఉత్తమ నటుడిగా, ‘జూడీ’ చిత్రంలో నటనకుగాను రెనీ జెల్‌వెగర్ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.

‘పారాసైట్’కు అవార్డుల పంట…
ఆస్కార్ అవార్డుల చరి త్రలో ఇప్పటివరకు ఇంగ్లీ ష్ మూవీస్ మాత్రమే ఉత్త మ చిత్రం అవార్డులను అందుకున్నాయి. మొదటిసారి కొరియన్ మూవీ ‘పారాసైట్’ ఉత్తమ చిత్రంగా నిలిచి సత్తా చాటింది. అదేవిధంగా ఈ చిత్రానికి నాలుగు ఆస్కార్‌లు దక్కడం విశేషం. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డులను సైతం ‘పారాసైట్’ అందుకుంది.

వార్ ఎపిక్ డ్రామాకు మూడు ఆస్కార్‌లు…
రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆంబ్లిన్ పార్ట్‌నర్స్ సంస్థలు కలిసి మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సామ్ మెండెస్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘1917’. ఇటీవల విడుదలైన ఈ వార్ ఎపిక్ డ్రామా మూడు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ సౌండ్ మిక్సింగ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్‌కుగాను ‘1917’ మూడు ఆస్కార్‌లను గెలుచుకోవడం విశేషం. ఇక ఈ చిత్రం అమెరికా, యుకెలలో రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది. జార్జ్ మెక్‌కే, డీన్ చార్లెస్ చాప్‌మేన్, కొలిన్ ఫెర్త్, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.

ఆస్కార్ 2020 విజేతలు : ఉత్తమ చిత్రం : పారాసైట్, ఉత్తమ దర్శకుడు : బోన్‌జోన్ హో (పారాసైట్), ఉత్తమ నటుడు : జోక్విన్ ఫీనిక్స్ (జోకర్), ఉత్తమ నటి : రెనీ జెల్‌వెగర్ (జూడీ), ఉత్తమ సహాయ నటుడు : బ్రాడ్ పిట్ (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్), ఉత్తమ సహాయ నటి : లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ), ఉత్తమ సంగీతం : జోకర్ (హిల్దార్), ఉత్తమ సినిమాటోగ్రఫీ : 1917 (రోజర్ డికెన్స్) , ఉత్తమ సౌండ్ మిక్సింగ్ : 1917 (మార్క్ టేలర్, స్టువర్ట్ విల్సన్), ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ : ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ (డొనాల్డ్ సిల్వెస్టర్) , ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ : 1917 (రోచ్‌రాన్, గ్రెగ్ బట్లర్, డోమినిక్ తువే), ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ : బాంబ్ షెల్, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : టాయ్ స్టోరీ 4, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ : హె యిర్ లవ్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : బోన్‌జోన్ హో (పారాసైట్) , ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్, ఉత్తమ కా స్టూమ్ డిజైన్‌ః జాక్వెలిన్ దురన్ (లిటిల్ ఉమెన్), ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ : అమెరికన్ ఫ్యాక్టరీ

Oscar winner is Parasite
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News