Home కెరీర్ ఒయు పిహెచ్‌డి ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల

ఒయు పిహెచ్‌డి ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల

Osmania-University

హైదరాబాద్: 2016 సంవత్సరానికిగాను ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్‌డి ప్రవేశ పరీక్షకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం జనవరి 9 నుంచి 30 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2014-15, 2015-16, 2016-17 విద్యా సంవత్సరాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దీనికి అర్హులు. అలాగే 55 శాతం మార్కులతో ఒసి, బిసి అభ్యర్థులు పిజి ఉత్తీర్ణులై ఉండాలి. ఇక ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులు 50 శాతం మార్కులతో పిజి పూర్తి చేసి ఉన్నావారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పూర్తి వివరాల కోసం www.osmania.ac.in అనే వెబ్‌సైట్‌లో చూడవచ్చు.