దేశీయంగా 947% పెరిగిన వినియోగం
న్యూఢిల్లీ: కోవిడ్ -19, లాక్డౌన్ కారణంగా డేటా డిమాండ్ పెరిగింది. మార్చి నుండి జూలై మధ్య వరకు డేటా వినియోగం 947 శాతం పెరిగింది. డేటా వినియోగం ఎక్కువగా ఒటిటి, వీడియో అనగా విఒడి ప్లాట్‌ఫారమ్‌లలో ఉంది. ఇంటి వద్ద ఉన్న వ్యక్తులు మొబైల్ లేదా సిస్టమ్‌లో ఎక్కువ డేటాను ఉపయోగిస్తున్నారు. ఫ్రాంక్ఫర్ట్ ఆధారిత ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ప్రకారం, మార్చి- ఏప్రిల్ మధ్య కాలంలో ఒటిటి, వీడియోలలో 249% డేటా వినియోగం పెరిగింది.
అంటే 2020 ఫిబ్రవరితో పోలిస్తే విఒడి ప్లాట్‌ఫాంలు ఎక్కువగా వాడుతున్నారు. అదే సమయంలో డేటా వినియోగానికి డిమాండ్ మార్చి నుండి జూలై వరకు 947 శాతం పెరిగింది. నోకియా వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ (ఫిబ్రవరి 2020) నివేదిక ప్రకారం, వినియోగదారులు ఒటిటి ప్లాట్ఫామ్లో రోజుకు సగటున 70 నిమిషాలు గడుపుతున్నారు.టెలికాం పరికరాలను తయారుచేసే ప్రధాన సంస్థ ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలో తలసరి నెలవారీ డేటా వినియోగం 2025 నాటికి నెలకు 25 జిబికి చేరుకోనుంది.