Home తాజా వార్తలు మణిపూర్ రైలు ప్రాజెక్టుకు మన సారథి…

మణిపూర్ రైలు ప్రాజెక్టుకు మన సారథి…

 Manipur rail project

 

* పనితీరుకు కేంద్ర మంత్రి, మణిపూర్ సిఎం ప్రశంసలు
* పర్యావరణానికి హాని కలిగించకుండా నిర్మాణం
* కితాబునిచ్చిన కేంద్ర పర్యావరణశాఖ
* రూ. 14 వేల కోట్ల ఖర్చుతో రైలు మార్గం
* పనులను స్వయంగా పరిశీలిస్తున్న పిఎంఓ అధికారులు

హైదరాబాద్ : మణిపూర్ రాష్ట్రంలో మెగా రైలు ప్రాజెక్టుకు (ఐఆర్‌ఎస్‌ఈ) క్యాడర్‌కు చెందిన భారత ప్రభుత్వ సీనియర్ స్థాయి గ్రూపు ఎ అధికారి, హైదరాబాద్ వాసి సాయిబాబా అంకాలాకు సారథ్య బాధ్యతలు వరించాయి. ప్రాజెక్టును ఆయన అతి సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ఎక్కడా పర్యావరణానికి హాని కలిగించకుండా సాయిబాబా పనులు చేయిస్తున్నారు. స్థానికంగా ఉన్న వనరులు దెబ్బతినకుండా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టుకు ‘నేషనల్ ప్రాజెక్టుగా’ గుర్తింపు సాధించింది. దీనికోసం ఆయన కొత్త విధానాలను రూపొందించారు. ప్రాజెక్టు ప్రారంభ అయిన తరువాత పచ్చని చెట్లు, కొండలు, గుహల మధ్య నుంచి కొనసాగే ఈ రైలు యాత్ర ప్రయాణికులను మంత్రముగ్ధుల్ని చేస్తుందనడంలో అతిశయోక్తి లేదని మణిపూర్ వాసులు పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టును ఢిల్లీ నుంచి పిఎంఓ అధికారులు పర్యవేక్షిస్తుండగా, ఇప్పటికే ఈయన పనితీరును కేంద్ర రైల్వే మంత్రితో పాటు మణిపూర్ సిఎంలు అభినందించారు. ఈ ప్రాజెక్టు పనులు పరిశీలించిన కేంద్ర ఎన్విరాన్‌మెంట్ విభాగం కితాబునిచ్చింది.

హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో 15 సంవత్సరాలు
సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ తరువాత ఐఐఎస్‌సి బెంగళూరు నుంచి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో సాయిబాబా అంకాలా ఎంఈ చేశారు. అనంతరం జేఎన్‌టీయూ హైదరాబాద్ నుంచి ఐటి (అస్సెట్ మేనేజ్‌మెంట్)లో ఎంబీఏ చేశారు. ప్రస్తుతం ఆయన తన 57 ఏళ్ల వయస్సులోనూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్‌లో గౌహతీ ఐఐటి నుంచి పీహెచ్‌డీని చేస్తున్నారు. గతంలో ఆయన హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో డిజైన్, సిస్టం ఆఫ్టిమైజేషన్‌లో 15 సంవత్సరాల పాటు పనిచేశారు. ప్రస్తుతం ఆయన మణిపూర్ రాష్ట్రంలో మెగా రైలు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.14 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది.

పొడవైన సొరంగాలతో పాటు ప్రధాన వంతెనలు
మెగా ప్రాజెక్టులో భాగంగా ఈ రైలుమార్గం మణిపూర్ రాజధాని ఇంఫాల్‌తో పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాలను కలుపుతూ రూపొందుతుంది. ఉప హిమాలయన్ పర్వత భూభాగంలో ఉన్న ఈ రైలు లైన్ ప్రాజెక్టులో చాలా పొడవైన సోరంగాలతో పాటు ప్రధాన వంతెనలను కలిగి ఉంటుంది. వీటిలో ప్రపంచంలోని అత్యంత పొడవైన వంతెనతో పాటు ఈశాన్య దిశలో పొడవైన సోరంగం ఉంది.

ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్న సాయిబాబా
గోల్డెన్ పీకాక్’ అవార్డు నామినేషన్ ప్రతిపాదన

ఈయన అనుసరించే విధానాల వలన స్థానికులకు ఉపాధి లభించడంతో పాటు ఈ ప్రాజెక్టుకు మేలు జరుగుతోంది. ఆయన తీసుకుంటున్న చర్యలను కేంద్ర రైల్వే మంత్రితో పాటు మణిపూర్ సిఎం అభినందించారు. ఈ ప్రాజెక్టులో సాయిబాబా అంకాలా అనుసరిస్తున్న విధానాలు పర్యావరణానికి మేలు చేసేలా ఉండడంతో మినిష్టర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ‘గోల్డెన్ పీకాక్’ అవార్డుకు నామినేషన్‌ను ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు పూర్తిగా కొండలు, లోయలు, పచ్చదనంతో నిండిఉండంతో ఇది ‘నేషనల్ ప్రాజెక్టుగా’ గుర్తింపు పొందింది. పర్యావరణాన్ని రక్షించడంతో పాటు స్థానికుల ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్ధేశ్యంతో వ్యర్థపదార్థాలను రీ సైక్లింగ్ చేస్తున్నారు. దీనివలన స్థానికంగా నివసించే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికోసం సాయిబాబా చాలా వివిధ మార్గాలను పరిశీలించారు. అతని చదువు కూడా ఈ ప్రాజెక్టుకు చాలా ఉపయోగపడింది. ప్రయోగశాలలో అనేక ట్రయల్స్ రన్ నిర్వహించిన తరువాతే ఈ ప్రాజెక్టు సంబంధించిన పనులను చేపట్టారు.

 

Our captain for the Manipur rail project