Home తాజా వార్తలు మన బోనాల పండుగ…

మన బోనాల పండుగ…

Bonalu

 

ఆరవ నిజాం నవాబు తరువాత తిరిగి బోనమెత్తిన తెలంగాణ పాలకుడు కెసిఆర్

2014 జూన్ 2న తెలంగాణ ప్రజల కలల పంటగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజలు తరతరాలుగా ఎంతో వైభోవోపేతంగా జరుపుకుంటున్న బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని తెలంగాణ ఉద్యమ కాలంలో కెసిఆర్ గారు బలంగా నినదించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రకటించడమే గాక అమ్మవారికి తానే స్వయంగా బంగారు బోనం సమర్పించి, ప్రజల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా మొక్కు చెల్లించుకున్నారు.

1908వ సంవత్సరంలో నిజాం నవాబు మూసీ నది వరదల సందర్భంగా బోనం ఎత్తిన పిమ్మట మళ్లీ 106 సంవత్సరాలకు మరొక తెలంగాణ పాలకుడు కె.చంద్రశేఖర్‌రావు అమ్మవారికి బోనం ఎత్తి, అమ్మవారి పట్ల తనకున్న భక్తి ప్రపత్తులను, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తనకు గల అపారమైన గౌరవాదరాలను కెసిఆర్ గారు ప్రకటించారు. అంతేగాక, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో బోనాలు, బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగలుగా ప్రకటించడమే గాక, దేశ రాజధాని ఢిల్లీలో కూడా 2015 నుంచి ఏటా బోనాల పండుగను నిర్వహిస్తున్నారు. బోనాలు జరిగే ప్రతి ఆలయానికి ప్రభుత్వమే నిధులు కేటాయించి, వసతి సౌకర్యాలు, అలంకరణ వంటి ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకుగాను తెలంగాణ భాషా సంస్కృతులను ప్రేమించే ప్రజలంతా మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని మనసారా అభినందిస్తున్నారు.

తెలంగాణ ప్రాంతానికి అపారమైన సాంస్కృతిక వారసత్వ సంపద ఉన్నది. చరిత్ర పూర్వయుగంలోనే ఇక్కడ ఘనమైన నాగరికత పరిఢవిల్లింది. ప్రపంచ కథా సాహిత్యంలోనే మొట్టమొదటిదని భావించబడుతున్న బృహత్ కథను రచించిన గుణాఢ్యుడు పటాం చెరువు ప్రాంతం వాడని పరిశోధకులు భావిస్తున్నారు. అలాగే మహాకవి కాళిదాసు కావ్యాలకు వ్యాఖ్యానాలు రచించిన ప్రఖ్యాత సంస్కృత పండితుడు కోలాచలం మల్లినాథసూరి మెదక్ జిల్లా కొల్చారం గ్రామవాసి. కోలాచలమే కాలక్రమంలో “కొల్చారం”గా మారింది. “వాణి నా రాణి” అని సగర్వంగా ప్రకటించుకున్న పిల్లల మఱ్ణి పినవీరభద్ర కవి స్వగ్రామం పిల్లల మఱ్ణి నల్గొండ జిల్లాలో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహాకవులు తెలంగాణ గడ్డపై ఉద్భవించారు.

తెలంగాణ జానపద కళా సాహిత్యాలకు కూడా పురిటిగడ్డ. ఇక్కడ లేని జానపద ప్రక్రియ అంటూ లేదు. స్త్రీల పాటలు, కోలాటాలు, పేదరాసి పెద్దమ్మ కథలు, జానపద కథా గేయాలు, పారిశ్రామిక గేయాలు, మార్మికతతో కూడుకున్న తాత్విక గేయాలు, పొడుపు కథలు, సామెతలు, పిల్లల పాటలు, జాజిరి పాటలు, ఉయ్యాల పాటలు, శృంగార గేయాలు, వీర గాథలు ఇలాంటి గేయ సాహిత్యంతో పాటు జానపద నృత్యాలు, గిరిజన నృత్యాలు కోకొల్లలుగా తెలంగాణ గ్రామీణ వాతావరణంలో తరతరాలుగా మనుగడ సాగిస్తున్నాయి. తెలంగాణలో జరిపే బోనాల పండుగ, బతుకమ్మ పండుగ, పీర్ల పండుగ, తీజ్ పండుగ తెలంగాణ జీవన విధానానికి ప్రతీకలు. మరే ప్రాంతంలోనూ ఇటువంటి పండుగలు లేవు. నిరుపమానమైన, ఎంతో ఉత్కృష్టమైన తెలంగాణ సంస్కృతి రాజకీయ కారణాల వల్ల గతంలో కొంత మరుగున పడిపోయిన మాట వాస్తవం.

తెలంగాణ సంస్కృతి పట్ల మనలో స్ఫూర్తిని రగిలించిన మహా వ్యక్తి మన ముఖ్యమంత్ర కె. చంద్రశేఖర్ రావు. తెలంగాణ ప్రజలకు రాజకీయంగానే కాక సాంస్కృతికంగా కూడ జాగృతం చేసి, మహాత్మాగాంధీ పంథాలో ఎక్కడా హింసకు తావు లేకుండా అనితరసాధ్యమైన రీతిలో 16 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఒక మహోద్యమాన్ని నడిపి, ముందుగా మనలో సాంస్కృతిక చైతన్యాన్ని రగిల్చి, తెలంగాణ గత వైభవాన్ని మనకు గుర్తు చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పరిణితి చెందిన రాజనీతిజ్ఞుడు మన కెసిఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. రాజకీయ నేతలందరూ కెసిఆర్ ది అంతా వృథా ప్రయాస అన్నవారే. అయితే కెసిఆర్ ఎట్లా అయితే గాంధీజీ మన దేశానికి స్వాతంత్య్రం కంటే ముందు మనలోని అస్పృశ్యత, అశుభ్రత, అవినీతి, అనైతికత వంటి సామాజిక రుగ్మతలను నశింపడానికి ప్రజలను చైతన్యవంతులను చేశారో, అదే పద్ధతిలో కెసిఆర్ తెలంగాణకు మాత్రమే స్వంతమైన మన గత సాంస్కృతిక వైభవాన్ని ప్రజలకు గుర్తు చేసి, ప్రజలను జాగృతం చేశారు.

అందులో ముఖ్యమైనవి మన బోనాల పండుగ, మన బతుకమ్మ పండుగ. నిజం చెప్పాలంటే తెలంగాణ చాలా ప్రాంతాలలో ఈ పండుగలను జనం మర్చేపోయారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి మూలంగా మన సంస్కృతికి పునర్వికాసం, పునరుజ్వీవనం కలిగాయి. ఈ విషయంలో మన మాజీ ఎం.పి. శ్రీమతి కల్వకుంట్ల కవిత పోషించిన పాత్ర అద్వితీయమైనది. “తెలంగాణ జాగృతి” సంస్థను స్థాపించి, బతుకమ్మ పండుగను వాడవాడలా నిర్వహించడమే కాక అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ, ఉద్యోగినులతో పాటు ఐఎఎస్, ఐపిఎస్ అధికారిణులు, మంత్రులు కలిసి ఒకేచోట బతుకమ్మ ఆడటం ఒక అపూర్వమైన సన్నివేశం. తరతమ భేదాలను మరచి సుహృద్భావ వాతావరణంలో అన్ని వర్గాల వారు కలిసి ఇటువంటి సాంస్కృతిక ఉత్సవాలలో చేయి చేయి కలిపి పాల్గొనడం దేశ చరిత్రలోనే ఒక అరుదైన సంఘటన.

మహా నాయకుడు మన కెసిఆర్ కృషితో తెలంగాణ ప్రజల కలల పంటగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరించింది. కెసిఆర్ నాయకత్వంలో అనితరసాధ్యమైన రీతిలో కాళేశ్వరం వంటి ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను నిర్మించుకుని, బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పరుగులు తీస్తున్నది. తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలైన బోనాలు, బతుకమ్మ వంటి పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించి, వీటిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించే సువర్ణావకాశం మనకు లభించింది. ఈ విధమైన ప్రభుత్వ ప్రోత్సాహం తెలంగాణ సంస్కృతి, కళల వికాసానికి ఎంతగానో దోహదపడుతుందనడంలో సందేహం లేదు. తెలంగాణ సంస్కృతిలో బోనాలు, బతుకమ్మ పండుగలు అతి ముఖ్యమైన సామాజిక ఉత్సవాలు. బోనాలు ఆషాఢమాసంలో తొలకరి ప్రారంభమైన తరువాత పంటలు వేస్తూ చేసుకునే పండుగ. బతుకమ్మ ఆశ్వీయుజ మాసంలో పొలాలు పైరు పచ్చలతో కళకళలాడుతుండగా చేసుకునే పండుగ. రెండు ప్రకృతిని సంబంధించిన పండుగలే.

బోనాల పండుగ అమ్మవారి పండుగ. అమ్మవారికి పెట్టే నైవేధ్యమే బోనం. బోనం అంటే భోజనమే. కొత్త పాత్రలో బియ్యం, బెల్లం కలిపి వండుతారు. ఒక కొత్త కుండకు సున్నం పూసి. జాజు, పసుపు, కుంకుమలతో బొట్టు పెట్టి అందంగా అలంకరిస్తారు. ఆ కుండలో ఈ బెల్లం అన్నం నైవేద్యాన్ని వుంచి, కుండపై చుట్టూ వేపాకులు పేర్చి, దానిపై చిన్న గిన్నెలో పానకం పోసి, ఆ పానకం గిన్నె పై ఒక ప్రమిదను అమర్చి, దానిలో దీపం వెలిగించి మహిళలు బోనాన్ని ఎత్తుకుని, అమ్మవారి ఆలయానికి బయలుదేరుతారు. కొందరు అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. దీనిని “చద్ది” అని పిలుస్తారు. పసుపు నీటిని వేపాకులతో చల్లుకుంటూ బోనం ఎత్తుకున్న వారిని అనుసరించి ఇంటిల్లిపాదీ డప్పులు, కొమ్ములు, డోళ్లు వాయించుకుంటూ అమ్మవారి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. బోనాన్ని (నైవేద్యం) అమ్మవారికి సమర్పించిన తరువాత ఆ ప్రసాదాన్ని భక్తులు ఇంటికి తెచ్చుకుని, కుటుంబ సభ్యులకు, చుట్టు ప్రక్కల వారికి పంచిపెడతారు. కొందరు భక్తులు బోనంతో పాటుగా కోడి పుంజులను, మేక పోతులను, పొట్టేళ్లను కూడా అమ్మవారికి బలి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. బోనాల పండుగలకు ఆడ పిల్లలను పుట్టిళ్లకు పిలుచుకోవడం కూడా తెలంగాణలో ఆనవాయితీ.

అమ్మవారు ప్రకృతికి ప్రతీక. సమస్త సృష్టికి మూలం అమ్మవారే. అమ్మవారు గ్రామాలలోనే కాక, కొండలలోనూ, కోనలలోనూ, అడవులోనూ, పొలాలలో చెట్ల క్రింద, కోట గోడల ప్రక్కన, చెరువు కట్టల క్రింద ప్రకృతి అంతటా విస్తరించి ఉంటుంది. అమ్మవారు అనుగ్రహించి చల్లగా చూస్తే, సకాలంలో మంచి వర్షాలు పడి, సమృద్ధిగా పంటలు పండి, ప్రజలు, ఇతర జీవాలు సుఖంగా, ఆరోగ్యంగా జీవిస్తారు. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావడానికి ఉడతాభక్తిగా మనం సమర్పించుకునే నైవేద్యమే బోనంజ బోనంతో పాటు అమ్మవారికి చీర, సారె, పసుపు కుంకుమ, గాజులు కూడా కొందరు భక్తులు సమర్పించుకుంటారు. అమ్మ వారికి ఆగ్రహం కలిగితే ప్రకృతి అంతా అల్లకల్లోలం అయిపోతుందది. సమయానికి వర్షాలు పడవు. పంటలు పండవు. చేలు బీడు భూములవుతాయి. రకరకాల రోగాలు పట్టుకొస్తాయి. గత్తరలు వస్తాయి. అంటే క్షామం, మందులకు తగ్గని రోగాలు, తేళ్లు, పాములు వంటి కీటకాలు, పులులు, తోడేళ్ల వంటి క్రూర మృగాలు గ్రామాల మీద దాడి చేస్తాయి. ఎంతో ప్రాన జరుగుతంది. అరిష్టాలు సంభవిస్తాయి.

అమ్మవారికి ఏడుగురు అక్కా చెల్లెళ్లు. వీరిని “శివ సత్తులు” అంటారు. వీరిని పెద్దమ్మ, మైసమ్మ, పోచమ్మ, పోలేరమ్మ, రేణుకా ఎల్లమ్మ, లక్ష్మమ్మ, మారెమ్మ అని వివిధ నామాలతోటి పిలుస్తారు. ప్రాంతాలను బట్టి వీరి పేర్లు మారుతుంటాయి. వీరంతా గ్రామ దేవతలు. వారికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు పోతురాజు. అమ్మవారు ఆగ్రహిస్తే వీరంతా ఊళ్ల మీద పడి బీభత్సం సృష్టిస్తారు. సకాలంలో వర్షాలు కురవవు. అధిక వర్షాలు, తుపానులు వచ్చి చెరువు కట్టలు తెగి, వరదలు ముంచెత్తి పంటలు నాశనం అవుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రకృతి ప్రకోపించి జనాన్ని ఎన్నో ఈతి బాధలకు గురి చేస్తుంది. అందుకే అమ్మవారి కరుణాకటాక్షాలకు పాత్రులు కావడానికి మనమంతా నిరంతరం అమ్మవారిని మన శక్తి కొలది కొలుస్తాము. మనమంతా అమ్మ బిడ్డలం. అమ్మ మన నుంచి ఏమీ ఆశించదు. కేవలం భక్తి మాత్రమే. ఎవరి పద్ధతి ప్రకారం వారు అమ్మవారిని కొలిచినా, ఇంత బెల్లం అన్నమో, పెరుగన్నమో సంవత్సరానికి ఒకసారి బోనంగా సమర్పిస్తే చాలు. అమ్మ ప్రసన్నం అవుతుంది. ప్రజలంతా సుఖశాంతులతో జీవిస్తారు.

బోనాల పండుగ కన్నుల పండువగా జరిగే ఒక సామాజిక ఉత్సవం. మహిళలు తల స్నానాలు చేసి, కనులకింపైన శుభ్రమైన వస్త్రాలను ధరించి, శుచిగా బోనం తయారు చేసుకొని, ఇరుగు పొరుగులతో కలిసి సామూహికంగా అమ్మవారి గుడికి వెళ్లి బోనం సమర్పించడం ఒక ఆహ్లాదకరమైన దృశ్యం. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన బోనాన్ని ఇంటికి తెచ్చుకుని ప్రసాదంగా స్వీకరించడం శుభప్రదం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల పండగకు చారిత్రక నేపథ్యం ఉంది. ఇది తెలంగాణ ప్రజల జీవన విధానంలో ఒక భాగం. ఆషాఢ మాసంలో ముప్పై రోజులు మూడు ప్రధాన ప్రాంతాలలో వేరువేరుగా జాతరలు నిర్వహిస్తారు. ఇది వన దేవతల ఆరాధన. పురాతనమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ఆషాఢమాసం ప్రారంభమయ్యే మొదటి రోజే బోనాల జాతర ప్రారంభమవుతుంది.

ఏడాది మొత్తం పొలాలు పచ్చదనంతో కళకళలాడాలని, పాడి పంటలు సమృద్ధిగా వుండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ప్రశాంత జీవనం గడపాలని కోరుకుంటూ అమ్మవారికి బోనం, మొక్కులు సమర్పించి భక్తి శ్రద్ధలతో ఆరాధించే ఆధ్యాత్మిక భావన ఈ పండుగ. హైదరాబాద్ చారిత్రక నేపథ్యానికి నిలువెత్తు నిదర్శనమైన గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక అమ్మవారి రూపంలో వెలసిన ఆదిపరాశక్తికి మొట్టమొదటి బోనం, తొట్టెలను సమర్పించడంతో ఈ బోనాల జాతర మహాఘట్టం ప్రారంభమవుతుంది. గోల్కొండ కోటలో తరతరాలుగా ఒక కుటుంబం వారు మొట్టమొదటి బోనం సమర్పించడంతో నగరంలో బోనాల జాతర మొదలవుతుంది. ఆషాఢమాసం చివరి రోజున మళ్లీ ఇక్కడి అమ్మవారికి చివరి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత బోనాల జాతర ముగుస్తుంది. ఈ నెల రోజుల పాటు జంట నగరాలు మొత్తం ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగి ఉంటాయి. ఆషాఢంలో నెల రోజుల పాటు జాతర జరిగినా, ఆది, మంగళ వారాలలో ఎక్కువ మంది భక్తులు అమ్మవారికి మొక్కులు, తొట్టెలు సమర్పిస్తారు. గోల్కొండ కోటలో తొలి బోనాల జాతర ప్రారంభమైన పిమ్మట సికింద్రాబాద్‌లోని ఉజ్జయిన మహంకాళి జాతర జరుగుతుంది.

దాదాపు రెండు శతాబ్దాల క్రితం అంటే 1813 ప్రాంతంలో హైదరాబాద్ సికింద్రాబాద్ పరిసరాలలో “ప్లేగు” వ్యాధి ప్రబలి వేలాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఆ సందర్భంలో “లష్కర్‌” గా పిలవబడే సికింద్రాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి వెళ్లిన మిలిటరీ బెటాలియన్‌కు చెందిన ఒక సైనికుడు ఉజ్జయినిలోని అమ్మవారిని దర్శించి, తమ పిల్లా పాపలను “ప్లేగు” వ్యాధి నుంచి కాపాడమని వేడుకున్నాడు. ఆ మిలిటరీ బెటాలియన్ తిరిగి సికింద్రాబాద్‌కు వచ్చే సరికి ఇక్కడ వ్యాధి మటుమాయమైంది. తన మొక్కులు ఫలించాయన్న ఆనందంలో ఆ సైనికుడు మళ్లీ ఉజ్జయినికి వెళ్లి అక్కడి నుంచి అమ్మవారి ప్రతిమను తెచ్చి సికింద్రాబాద్‌లో “ఉజ్జయిని మహంకాళి అమ్మవారు” పేరుతో ప్రటిష్టించి, “బోనాలు” పేరుతో మొక్కులు చెల్లించుకునే సంప్రదాయాన్ని ప్రారంభించాడని ఇక్కడి పెద్దలు చెబుతారు. వందల సంవత్సరాల ఘన చరిత్ర గల హైదరాబాద్ పాత బస్తీలో నెలకొని వున్న మహిమాన్విత దేవాలయం “లాల్ దర్వాజ” లోని శ్రీ సింహ వాహిని మహంకాళి దేవాలయం. ఈ దేవాలయానికి నాలుగు వందల సంవత్సరాల మహత్తర చరిత్ర ఉంది. ఇక్కడ వెలసిన మహంకాళి అమ్మవారు భక్తులకు కొంగు బంగారంగా నెలకొని ఉండి, కోరిన కోరికలను తీర్చుతున్నారు.

హైదరాబాద్ నగరానికి 1908వ సంవత్సరంలో విపరీతమైన వరదలు వచ్చాయి. వరద నీరు చార్మినార్ మైసమ్మ గుడి వరకు వచ్చాయి. నగరమంతా అతలాకుతలమై జనం ఆందోళన చెందుతుంటే, “వజీర్ ఆజం” గా పిలవబడే హైదరాబాద్ స్టేట్ ప్రధాన మంత్రి రాజా కిషన్ ప్రసాద్ అప్పటి హైదరాబాద్ ఆరవ నిజాం నవాబు మెహబూబ్ అలి పాషాకు, లాల్ దర్వాజలోని సింహ వాహిని శ్రీ మహంకాళి అమ్మవారి మహత్తును వివరించి, అక్కడ పూజలు చేసినట్లైతే మూసి నది శాంతిస్తుందిన సలహా ఇచ్చారు. ప్రజల మత విశ్వాసాలను గౌరవించే నిజాం నవాబు బంగారు చాటతో మేలిమి ముత్యాలు, పసుపు కుంకుమ, గాజులు తీసుకుని ఆలయానికి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాడు. తరువాత అక్కడి నుంచి బయలుదేరి చార్మినార్ వరకు వచ్చిన నీటి వద్దకు చేరుకున్నాడు. భాగ్యలక్ష్మి అమ్మవారిని పూజించి, నగరంలోని స్త్రీల సౌభాగ్యాన్ని కాపాడమని వేడుకున్నాడు. బంగారు చాటతో తీసుకొచ్చిన ద్రవ్యాలన్నింటినీ నిజాం నవాబే స్వయంగా వరద నీటికి సమర్పించి, ప్రవాహంలోకి వేశారు.

తక్షణమే ప్రవాహం వెనక్కి తగ్గింది. అంతే కాక ఆనాటి నుంచి ఎలాంటి వరదలు వచ్చినా, ఇక్కడ మాత్రం ఎంతో సురక్షితంగా వుండేది. ముత్యాలకు, పసుపుకుంకుమకు, గాజులకు ఇంత మహత్తు ఉందా అని ఆశ్చర్యపోయిన వ్యాపారస్థులు అక్కడే దుకాణాలు ఏర్పరచుకుని, దానిని వ్యాపారకేంద్రంగా మార్చుకున్నారు. అందుకే హైదరాబాద్‌ను సముద్రంలేని ముత్యాల నగరంగా పిలుస్తారు. పత్తరుగట్టి, గుల్జార్‌హౌస్ ప్రాంతంలో ముత్యాలు, లాల్‌బజార్‌లో గాజులు, చార్మినార్ పోలీస్‌స్టేషన్ పక్కన పసుపుకుంకుమ తదితర పూజా సామగ్రి దుకాణాలు వెలిశాయి. ఆ రోజు నుంచి అమ్మవారికి బోనాల పండుగను చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల పండుగను ఆషాఢమాసంలో మొదటవచ్చే శుక్రవారం నుంచి ప్రారంభించి తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు.

రంగం కార్యక్రమం
బోనాల చివరి రోజు సాయంత్రం “రంగం” అని పిలవబడే భవిష్యవాణి చెప్పే కార్యక్రమం ఉంటుంది. అమ్మవారి ప్రతినిధిగా సిగం పూనిన ఒక అవివాహిత పచ్చికుండపై నిలబడి ఈ భవిష్యవాణిని వినిపిస్తుంది. ఇందులో వర్షాలు సరిగా కురుస్తాయా, పంటలు బాగా పండుతాయా అన్న విషయాల నుంచి రాజకీయాలు, శాంతి భద్రతలు కూడా చోటుచేసుకుంటాయి. తనకు చెల్లించిన మొక్కులు సంతృప్తికరంగా ఉన్నాయో లేదా కూడా భవిష్యవాణిలో అమ్మవారు భక్తులకు చెబుతుంది. బోనాలు బాగున్నాయని అమ్మవారు చెబితే అమ్మవారి ఆశీస్సులు లభించినట్లే. బోనాల పట్ల అమ్మవారు అసంతృప్తి ప్రకటిస్తే ఆ సంవత్సరం అరిష్టం తప్పదని భావించాలి.

2014 జూన్ 2న తెలంగాణ ప్రజల కలల పంటగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజలు తరతరాలుగా ఎంతో వైభోవోపేతంగా జరుపుకుంటున్న బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని తెలంగాణ ఉద్యమ కాలంలో కెసిఆర్ గారు బలంగా నినదించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రకటించడమే గాక అమ్మవారికి తానే స్వయంగా బంగారు బోనం సమర్పించి, ప్రజల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా మొక్కు చెల్లించుకున్నారు.

1908వ సంవత్సరంలో నిజాం నవాబు మూసీ నది వరదల సందర్భంగా బోనం ఎత్తిన పిమ్మట మళ్లీ 106 సంవత్సరాలకు మరొక తెలంగాణ పాలకుడు కె.చంద్రశేఖర్‌రావు అమ్మవారికి బోనం ఎత్తి, అమ్మవారి పట్ల తనకున్న భక్తి ప్రపత్తులను, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తనకు గల అపారమైన గౌరవాదరాలను కెసిఆర్ గారు ప్రకటించారు. అంతేగాక, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో బోనాలు, బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగలుగా ప్రకటించడమే గాక, దేశ రాజధాని ఢిల్లీలో కూడా 2015 నుంచి ఏటా బోనాల పండుగను నిర్వహిస్తున్నారు. బోనాలు జరిగే ప్రతి ఆలయానికి ప్రభుత్వమే నిధులు కేటాయించి, వసతి సౌకర్యాలు, అలంకరణ వంటి ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకుగాను తెలంగాణ భాషా సంస్కృతులను ప్రేమించే ప్రజలంతా మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని మనసారా అభినందిస్తున్నారు.

తొమ్మిదిరోజుల పూజా విధానం

పండుగ తొమ్మిది రోజులలో వచ్చే మొదటి శుక్రవారం నాడు అమ్మవారి అభిషేకం, ధ్వజారోహణం, శిఖర పూజ, కళశ స్థాపన చేస్తారు. శనివారం లక్ష బియ్యపు గింజలతో అర్చన ఉం టుంది. సాయంత్రం మహా యజ్ఞాభిషేకం చేస్తా రు. ఆదివారం ఘట స్థాపన, శాలిబండలో ఉన్న కాశీ విశ్వనాథ దేవాలయం నుంచి అమ్మవారిని తెచ్చి దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు. సోమవారం లక్ష బిల్వార్చన కార్యక్రమం ఉం టుంది. మంగళవారం దీపోత్సవం, హారతి ఉం టాయి. దేవాలయం అంతటా, దేవాలయం పరిసర ప్రాంతాలను దీపాలతో అలంకరించి, అమ్మకు హారతి ఇవ్వడమే ఆరోజు ప్రత్యేకత. ఇది ఎంతో నయనాందకరంగా ఉంటుంది. బుధవారం శాకాంబరి పూజ నిర్వహిస్తారు. గురువారం నాడు “చెప్పన్ భోగి” ఉంటుంది.

అమ్మవారికి కారంతో పాటు తీపి అన్నా మహాఇష్టం. ఈరోజు శాకాహారంతో పాటు 56 రకాల తీపి వంంటకాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున అమ్మవారిని లక్ష పుష్పాలతో అలంకరిస్తారు. ఈ ఉత్సవాన్ని చూడటానికి జనం వేలాదిగా తరలివస్తారు. శుక్రవారం నా డు లక్ష కుంకుమార్చన చేస్తారు. శనివారం నా డు “నవచండీ హవనం” కార్యక్రమంలో భాగంగా పట్టుచీర, రవిక, పండ్లు, పూల, నె య్యి, హోమద్రవ్యాలు మొదలైనవి అ మ్మవారికి సమర్పిస్తున్నట్లుగా భావించి, ఆవన్నీ అమ్మవారికి చేరాలని సంకల్పించి యజ్ఞగుండంలో ఆహుతి చేస్తారు. తెలంగాణ రాకముం దు, తెలంగాణ రావాలి అన్న నినాదాన్ని వెండి రేకులు, రాగిరేకులపై రాసి హోమగుండంలోని అగ్నికి సమర్పించేవారు. ఆ రోజు రాత్రి 9గంటలకు అమ్మను ఊయలలో కూ ర్చుండబెట్టి లాలిస్తారు. ఆదివారం తెల్లవారుజామున 3గంటలకు బలి హరణం ఉంటుంది.

1955కు ముందు దున్నపోతును బలి ఇచ్చి రక్తం వంటికి పూసుకుని, పేగులు మెడకు చుట్టుకుని, కాలేయాన్ని నోట కర్చుకుని, ఒక కాలుని చేత్తో పట్టుకుని వికృతంగా నాట్యం చేసేవారట. మాంసాన్నంతా ముక్కలుగా నరికి అన్నంలో కలిపి “రతి” పోసేవారు. ( ఆ అన్నం కుప్పను రతి అంటారు). ఆ రతిని గంపలలో ఎత్తుకుని దేవాలయం పరిసర ప్రాంతాలలో వేలాది మం ది వెంట రాగా అమ్మవారి ప్రసాదంగా ప్రతి ఇంటి మీద రక్షణ కవచంగా “బలి బలి” అని కేకలు వేస్తూ వెదజల్లుతారు. ఆదివారం ఉద యం మహాభిషేకం జరుగుతుంది. అమ్మవారికి బిందెలతో కుంకుమ, పసుపు, తే నె, నెయ్యి, పాలు ఏకధాటిగా పోస్తారు. అమ్మవారు వీర, రౌద్ర, భయానకంగా గోచరించే ఒళ్ళు గగుర్పొడిచే ఒక అద్భుత దృశ్యమిది. ఈ కార్యక్రమం తరువాత అమ్మ కారుణ్యం, వా త్సల్య ం కురిపిస్తూ, ప్రశాంతంగా ప్రసన్న వదనంతో దర్శనమిస్తారు. సోమవారం ఉద యం అర్చన, లలితా సహస్రనామ పారాయణ, అవభ్రుదం అంటే శాస్త్రోక్తంగా, మంత్రయుక్తంగా చేసే పూజ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Our Festival of Bonalu