మన తెలంగాణ/కరీంనగర్ టౌన్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రా్రష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది పథకాలను చూసి మన రాష్ట్ర దేశంలోనే నంబర్ స్థానంలో ఉందని కేంద్రం తెల్చిందని కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని ఆర్‌ఆండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు అమలు చేయలేదని బిజెపి జిల్లా అధక్షులు ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల అవసరాల నిమిత్తం ఎన్నికల మేనిఫెస్టోలో పెందుపరుచని అంశాలను కూడ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. దశల వారీగా ఎన్నికల మేనిఫెస్టో అమలు జరుగుతుందని తలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులు మరి ఎన్నో పథకాలు మేనిఫెస్టోలో పొందు పరచలేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజల కోరిక మేరకే పథకాల అమలు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతుందన్నారు. విభజన చట్టం హామీలు అమలు కోసం బిజెపి నేతలు కేంద్రం ఒత్తిడి తేకుండా రాజకీయ లబ్దికోసం మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు. కేంద్రం బిజెపి అధికారంలో ఉన్న కూడ రాష్ట్రంలోని బిజెపి నాయకులు పార్లమెంట్‌లో ఒత్తిడి తేలేకపోవడం దారుణం అన్నారు. కనీసం రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకు కూడ జాతీయ హోదా ఇవ్వమని కేంద్రం పై ఒత్తిడి తేని నేతలు ఎవరంటే అది బిజెపి నేతలే అని మండిపడ్డారు. కరీంనగర్ నియోజక వర్గం అభివృద్దికి ఎమ్మెల్యే గంగుల సహకారంతో 1500 వందలకు కోట్లకు పైగా నిధలు కేటాయింపు జరుగుతుందని దశల వారిగా అభివృద్ది పనులు కోనసాగుతున్నాయని బిజెపి నేతలకు కనబడడం లేదా..అని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. బిజెపి అసత్యపు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. బిజెపి నాయకులు ఇకనైన కేంద్రం పై ఒత్తిడి తెచ్చి విభజన చట్టం ను అమలు కు సహకరించాలని సూచించారు. లేకుంటే రాష్ట్రంలో బిజెపి ఒటు శాతం తగ్గండం కాకుండా పార్టీ కనుమరుగు అవుతుందని జోష్యం చెప్పారు.