Home జిల్లాలు భిన్నత్వంలో ఏకత్వమే మన ఐక్యత

భిన్నత్వంలో ఏకత్వమే మన ఐక్యత

Harithaharam– ఈద్-మిలాప్‌లో పాల్గొన్న మంత్రి
బాన్సువాడ:దేశంలో వివిధ కులా లు, మతాలు, వర్గాలు, వర్ణాలున్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వమే మన ఐక్యత అని భారతదేశ సంస్కృతియే ప్రపంచ దేశాలకు ఆదర్శమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్ ఫంక్షన్ హా ల్‌లో జమాతే – ఉల్మాయే – హింద్ ఆధ్వర్యంలో ఈద్ -మిలాప్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పా ల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మా ట్లాడుతూ దేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హిందు, ముస్లింల ఐక్యతకు నిదర్శనమన్నారు. పంచ దార, పాలల్లా కలిసిపోయినట్లుగా హిందు, ముస్లింల తో పాటు ఇతర వర్గాల వారు కూడా కలిసి మెలసి అ న్నదమ్ముల్లా ఉంటున్నామన్నారు. కుల, మతాలు, వ ర్గాలు, వర్ణాలు వేరైనప్పటికీ మానవులంతా ఒకటేనని దివ్య ఖురాన్ తెలుపుతుందని తెలుగులో ప్రసంగించిన ఒక వక్త అన్నారు. తెలంగాణలో సంస్కృతి గంగా, జ మున, తహజీద్‌లా ఉందని అందుకనే సిఎం రాష్ట్ర ప్ర జలకు ఏ మతంతో, కులంతో సంబంధం లేకుండా అ న్ని పండుగలకు ప్రభుత్వం తరపున జరిపిస్తున్నార న్నారు. ఇలాంటి సాంప్రదాయం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదన్నారు. ప్రతిసారి రాష్ట్రంలో పం డుగల సమయంలో ప్రభుత్వం తరపున జరిపించి అం దరికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అందుకనే ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రం కన్నెత్తి చూస్తున్నాయని మంత్రి అన్నారు. కొన్ని మతతత్వ శక్తులు మన ఐక్యతను భం గం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయని, కుట్రలు చేస్తున్నాయని, వాటిని కూకటి వేళ్లతో తరమికొట్టాలని సిపిఐ నాయకుడు దుబాస్ రాములు అన్నారు. ఇస్లాం మతాన్ని ఉగ్రవాదంలో జోడించడం సబబు కాదని, ఏ మతం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని, అన్ని గ్రంథాల సారాంశం శాంతి సందేశమేనన్నారు. కావు న మన మంతా కుల, మతాలకు అతీతంగా కలసి మె లసి అన్నదమ్ముల్లా ఉండాలన్నారు. ఈ కార్యక్రమ ంలో జమాతే ఉల్మాయే హింద్ జిల్లా అధ్యక్షుడు వలి వుల్లా, ఉపాధ్యక్షులు లయిఖ్ అహ్మద్, బోధన్ ఆర్డీవో సుధాకర్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ సిహెచ్ గోపి, జడ్పీ చైర్మన్ దఫెదార్ రాజు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జీ కాసుల బాల్‌రాజ్, టిడిపి నాయకులు బద్యానా యక్, సిపిఐ డివిజన్ ఇంచార్జీ దుబాస్ రాములు, ఉప సర్పంచ్ ఖాలెక్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు అలీబీన్ అబ్దుల్లా, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు అలీముద్దీన్ బా బా, సొసైటీ చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, ఎఎంసీ చైర్మన్ నార్ల సురేష్‌గుప్త, టిఆర్‌ఎస్ నాయకులు ఎజాస్, ముఖీద్, జమా మజీద్ కమిచీ అధ్యక్షుడు నయ్యర్, అబ్దుల్ వాహబ్ తదితరులు పాల్గొన్నారు.
ఈద్గా వద్ద మొక్కలు నాటిన మంత్రి
బాన్సువాడ పట్టణ శివారులోని ఈద్గా వద్ద హరిత హారంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. ఈ స ందర్బంగా మంత్రి మాట్లాడుతూ సిఎం ప్రవేశ పె ట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.