Wednesday, April 17, 2024

చిన్నారుల్లో మా టీకాలు 91 శాతం సమర్థవంతం: ఫైజర్

- Advertisement -
- Advertisement -

Our vaccine is 91 percent effective in children: Pfizer

అమెరికాలో 5- 11 ఏళ్ల చిన్నారులకు నవంబర్‌లో టీకాలు

వాషింగ్టన్: 5 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారుల్లో కొవిడ్19 నియంత్రణకు తాము రూపొందించిన వ్యాక్సిన్ 91 శాతం సమర్థవంతమైందిగా తేలిందని అమెరికా ఔషధ కంపెనీ ఫైజర్ ప్రకటించింది. అధ్యయనం వివరాలను శుక్రవారం వెల్లడించింది. ఔషధ నియంత్రణ సంస్ధలు అనుమతి ఇస్తే అమెరికాలోని చిన్నారులకు నవంబర్‌లో వ్యాక్సిన్ పంపిణీ జరగనున్నట్టు భావిస్తున్నారు. ఆహారం, ఔషధాల నియంత్రణ సంస్థ(ఎఫ్‌డిఎ) నుంచి అనుమతి కోసం ఫైజర్ దరఖాస్తు చేసింది. వ్యాక్సిన్ పంపిణీపై వ్యాధుల నియంత్రణ కేంద్రం(సిడిసి) తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటికే అమెరికాలోని 12 ఏళ్లు పైబడినవారికి ఫైజర్ టీకాలను ఇస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారుల టీకాల కోసం తల్లిదండ్రులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నవేళ ఫైజర్ ప్రకటన వారికి ఊరట కలిగించనున్నది. అమెరికాలో 511 ఏళ్ల చిన్నారుల సంఖ్య 2 కోట్ల 80 లక్షలవరకు ఉన్నది. 25,000 చిన్నారుల వైద్యశాలలు ఇప్పటికే టీకాలకు ఆర్డర్ పెట్టాయి. డెల్టా వేరియంట్ వల్ల ఇటీవల అమెరికాలో కరోనా కేసులు మళ్లీ పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 2268 మంది చిన్నారులపై రెండు డోసుల ఫైజర్ వ్యాక్సిన్‌కు ట్రయల్స్ నిర్వహించారు. కరోనా సోకినపుడు వ్యాక్సిన్ తీసుకోనివారితో పోలిస్తే తీసుకున్నవారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని పరిశోధకులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News