Home తాజా వార్తలు మన సేవకురాలు శ్రీమతి శాంతి రంగ్యా…

మన సేవకురాలు శ్రీమతి శాంతి రంగ్యా…

 

గండ్వీడ్: సేవ చేయడం గొప్ప కాదు ..సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చిన ప్రజలే గొప్ప వాళ్ళు అనే నినాదంతో ప్రజలకు సేవ చేసే అలోచతో ఒక మారుమూల శేక్‌పల్లి తాండాకు చెందిన ఓ గిరిజన మహిళ ఎంఎస్సీ ,ఎంఈడీ పట్టాలు పొంది ఉద్యోగ అవకాశాలు మేండుగా ఉన్న ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు వచ్చిన మహిళ శాంతి. పరిగి మాజీ ఎంఎల్‌ఏ టి.రామ్మోహన్ రెడ్డి సమక్షంలో భారత ప్రజాస్వామ్యంలోఒక భాద్యతాయుతమైన గండీడ్ ఎంపిపి గా టికేట్ ఇచ్చి గెలిపించడంతో జీవిత రూపురేఖలు మారాయి. గండీడ్ మండలంలో ఆయా గ్రామాల్లో 60 నెలల కాలంలో గండీడ్ మండలంలను ఆర్థిక,సామాజిక,మౌళిక,ఇద్య,పారిశుద్య,మొదలగురంగాల్లో ప్రజల పోత్సహంతో నేనుమండల అభివృద్దికి మార్గం సుగుమం చేయడం జరిగింది.
ఉత్తమ ఎంపిపి శాంతి
గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలుగా గాంధీ చెప్పిన మాటలను స్పూర్తిగా తీసుకొని గ్రామాల్లో ప్రజలకు మౌళికవసతులు కల్పించారు. రోడ్లు, విద్యుత్, వీధిదీపాలు, మరుగుదొడ్లు, విద్య, వైద్యం, పారిశుధ్యం మొదలగు వసతులను విస్తరించడం జరిగింది. దీనికి గుర్తింపుగా ఉత్తమ ఎంపిపి అవార్డు అందించారు.
ప్రతి గ్రామంను పర్యవేక్షనతో గ్రామంలో ఉన్న అర్హులైన పించన్‌దారులను గుర్తించి పించన్ అందించారు.ఒంటరీ మహిళ ల పించన్ కోసం మంత్రుల దృష్టికి తీసువెళ్ళిన ఘనత .
నిరుపేద విద్యార్థులకు చేయుత …..యువతకు ఆదర్శం.
చదువు పై మక్కువ ఉండి చదవలేక బడి మానిన వారిని వసతి గృహాల్లో, ప్రైవేటు పాఠశాలలో ప్రవేశాలకు ఎంతో ప్రోత్సహించి విద్యార్థుల గుండెల్లో నిలచింది. ఉన్నత చదువులకు కూడ సలహసూచనలు ఇచ్చి వారి అభివృద్దికి తోడ్పడింది. మహిళ దినోత్సం సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుండి ఉత్తమ ఉపాధ్యాయ, ఉపాధ్యాయిరాలకు ఘనంగాసన్మానాలు చేస్తు ఉద్యోగుల హ్రుదయంలో నిలిచిని మహిళ శాంతి.
కులమాతాలకు అతీతంగా మండల పాలనకొనసాగిస్తు చిన్న పెద్ద తేడలేకుండ మండల ప్రజల మన్ననలు పొందింది. మహిళ, బాలికల పై దేశ రాజదాని లో కూడ తమ గొంతుకను వినిపించుకొంది. బాలిక సంరక్షణపై చర్చించిన ఘనత శాంతి రంగ్యాకు దక్కింది.
ఆపదలో ఉన్న వారికి అండగా
ఆరోగ్య పరిస్థితతి బాగులేని విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తు, ఇతర దేశాల్లో మృతి చెందిన మండల వాసుల కుటుంబంకు దైర్యం ఇస్తు మృతి చెందిన వారి మృతదేహాలను స్వగ్రామాలకు పంపుటకు కూడ ఉన్నత అధికారులతో సైతం మాట్లాడిన ఘనత శాంతి రంగ్యాకే దక్కింది.
జడ్పీటీసి అభ్యర్థిగా భరిలో
ప్రాదేశిక ఎన్నికల్లో జడ్పీటిసి అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు.జడ్పీటీసిగా గెలుపొందుతే ప్రభుత్వ కళాశాల ఏర్పాటు.కూరగాయల శీతలీకరణ కేంద్రం మంజూరి కోసం కృషి.నంచర్ల గేటులో పశువుల సంత. మీ ఆడపడుచు లా ఆదరించి తమ విలువైన ఓటు వేసి గెలించుకుంటే మళ్ళి 5 సంవత్సరాలు మీకు సేవలు చేయడానికి సిద్దంగా ఉంటు ఎల్లవేళ్లాల మీ ముందు ఉంటానని తెలిపారు.

 

Our waitress is Ms. Shanti Rangiya