Home తాజా వార్తలు పాక్ జైళ్లలో 500 మంది భారతీయులు

పాక్ జైళ్లలో 500 మంది భారతీయులు

PRISONER

లాహోర్: దాయాది పాకిస్తాన్‌లోని వివిధ జైళ్లలో 500 మందికి పైగా భారతీయులు బందీలుగా ఉన్నట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ లాహోర్ హైకోర్టుకు తెలిపింది. జైళ్లలో ఉన్న వారిలో అధికశాతం మత్య్సకారులేనని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. పాక్ జైళ్లలో 996 మంది విదేశీయులు బందీలుగా ఉండగా, వీరిలో 527 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పాక్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మత్య్సకారులందరూ అరేబియా సముద్రంలో పొరపాటున పాక్ ప్రాదేశిక జలాల్లో చేపల వేటకు వచ్చినవారేనని అధికారులు పేర్కొన్నారు.

Over 500 Indians lodged in Pakistani jails.