Friday, March 29, 2024

గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు

- Advertisement -
- Advertisement -

Gurukul schools

 

హైదరాబాద్ : నగరంలో బడుగు, బలహీన వర్గాల విద్యార్దులకు ఉచిత విద్యనందిస్తామనే హామీలో భాగంగా సిఎం కెసిఆర్ నాలుగేళ్ల క్రితం గురుకులాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి విద్యార్ది నాణ్యతతో కూడిన విద్యనభ్యసించాలని పేర్కొంటూ అన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పాఠాలు బోధిస్తున్నారు. ఈ ఏడాదిలో గురుకులాలు నిర్వహించే అర్హత పరీక్షలకు పెద్ద ఎత్తున పోటీపడి పాఠశాల్లో చేరేందుకు సిద్దమైతున్నారు. అంతే ఇప్పటివరకు ఉన్నబడులు పూర్తిగా అద్దెభవనాల్లో నిర్వహించడంతో ప్రభుత్వానికి భారంగా మారింది. అందుకోసం అనువైన ప్రాంతాల్లో గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముందుగా వాటికి సంబంధించి స్దలాలను సేకరించి, తరువాత నిర్మాణాలు చేపట్టేందుకు వేగం పెంచారు.

హైదరాబాద్ జిల్లాలో 75 గురుకులాలు ఏర్పాటు చేయగా, వాటిలో 40మైనార్టీ, 31 వెనకబడిన తరగతులు, 3 ఎస్సీ, ఒకటి ఎస్టీ గురుకులాలు ఏర్పాటు చేశారు. ఈగురుకులాల్లో ముందుగా 8 పాఠశాలకు స్దలాలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేసి సమీప ప్రాంతాల్లో స్దలాలను రెవెన్యూ అధికారులు గుర్తించి ఆమోదం కోసం ఉన్నతాధికారులు దస్త్రం పంపినట్లు వెల్లడిస్తున్నారు.గురుకుల పాఠశాలలకు చెందిన అధికారులు జిల్లా రెవెన్యూ అధికారులకు స్దలాలు ఇవ్వాలని కోరడంతో పాటు పాఠశాలల ఉన్నచోటనే కేటాయించే విధంగా మార్గాలు చూడాలని వినవించారు. వారి అభ్యర్ధను పరిశీలించిన రెవెన్యూ అధికారులు స్దలాలను గుర్తించి అవి ఏపాఠశాలకు అనువుగా ఉన్నాయో గుర్తించి పై అధికారులకు ప్రతిపాదనలు పంపారు. వారు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే సంబంధిత గురుకులాలకు కేటాయించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

స్దలాలు ఎంపిక పాఠశాలు వివరాలు రెవెన్యూ అధికారులు సిద్దం చేసినట్లు చెబుతూ గిరిజన గురుకుల పాఠశాల కోసం షేక్‌పేటలో సర్వేనెంబర్ 403/,సర్వేనెం. 7/3 లో 2400గజాలు స్దలం కేటాయింపు, అదే విధంగా గిరిజన పాఠశాల, కళాశాలలకు రెండింటికి ఇబ్రహింబాగ్‌లో సర్వే 212లో 860గజాలు స్దలం. మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌కు బండ్లగూడ మండంలో సర్వేనెం. 83లో 980గజాల స్దలం. చాంద్రాయణగుట్ట, కందికల్‌గేట్, బార్కాస్ మైనార్టీ విద్యాసంస్దలకు బండ్లగూడలోని సర్వేనెం. 191, సర్వే నెం. 281లో కలిసి 10 ఎకరాల స్దలం. మైనార్టీ బాలుర స్కూల్‌కు కందికల్‌గేట్ గ్రామంలో సర్వేనెం. 302లో 1020గజాల స్దలం. గిరిజన గురుకులా పాఠశాల కోసం గోల్కొండ సమీపంలోని ఇబ్రహింబాగ్ సర్వే 130లో 910 గజాల స్దలం.

అదే విధంగా మైనార్టీ హాస్టల్ కోసం సైదాబాద్ మండలంలోని వార్డ్ నెం. 174లో మాదన్నపేటలో స్దలం గుర్తించినట్లు చెబుతున్నారు. త్వరలో వీటికి సంబంధించిన భవన నిర్మాణ పనులకు శంకుస్దాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. మిగతా పాఠశాలలకు కూడా స్దల సేకరణ కోసం స్దానిక అధికారులకు ఆదేశాలు జారీచేశామని, ఉగాది పండుగలోగా 18 పాఠశాలలకు స్దలం కేటాయించే విధంగా చేసి, పేదల విద్యనందించే గురుకులాలను దేశంలో ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా చేస్తామని జిల్లా ఉన్నతాధికారులు వివరిస్తున్నారు.

Own buildings for Gurukul schools
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News