Home రాష్ట్ర వార్తలు ఆసుపత్రిలో హాహాకారాలు

ఆసుపత్రిలో హాహాకారాలు

ఇద్దరు దుర్మరణం, 100 మందికి గాయాలు, హన్మకొండ రోహిణి దవాఖానాలో ఆక్సిజన్ సిలిండర్ పేలుడు, షార్ట్ సర్కూట్, ఎగసిన జ్వాలలు, రోగుల ఉరుకులు పరుగులు 
Rohini-Hospital

ఎన్‌జిఒస్ కాలనీ, నయీమ్‌నగర్, వరంగల్ క్రైం : హన్మకొండ నగరంలోని ఒక ఆస్పత్రిలో సోమవారం పేలుడు సంబవించింది. ఈ ఘటనలో ఇద్ద్గరు రోగులు ప్రాణాలు కోల్పోగా మరో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉం దని ఆయా ఆస్పత్రులకు చెందిన వైద్యులు పేర్కొంటున్నారు. సుబేదారి ప్రాంతంలో గల రోహిణి సూపర్ స్పెషాలిటి హాస్పటల్‌లో సాయంత్రం ఆపరేషన్ థియేటర్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో శస్త్ర చేయించుకుంటున్న జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని వెంకట్రావుపల్లికి చెం దిన కుమారస్వామి (43) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న మరో మహిళ రత్న మల్లమ్మ (60) ఘటన తర్వాత మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మల్లారెడ్డి అనే మరో వ్యక్తి పరిస్థితి  ఆందోళనకరంగా ఉందని అంటున్నారు. మూడు అంతస్థుల్లో ఉన్న ఆస్పత్రి లోని రెండవ అంతస్తులో ఆపరేషన్ థియేటర్ ఉంది. కుమారస్వామికి వైద్యు లు సాయంత్రం శస్త్ర చేస్తున్న సందర్భంగా ఆక్సిజన్ సిలెండర్ పేలి ఒక్కసా రిగా షార్ట్ సర్కూట్ సంభవించడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. రెండవ అంతస్థు నుంచి దట్టమైన పొగలు, మంటలు ఉవ్వెత్తున ఎగసి ప డటంతో రోగులు, వారి బంధువులు హాహాకారాలతో ఉరుకులు, పరుగులు తీయడంతో ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే ఫైరింజన్లు అక్కడకు చేరుకుని మంటలను అందుపులోకి తీసుకు వచ్చాయి. ఒక వైపు మంటలు, పొగ, మ రో వైపు రోగుల అరుపులు, కేకలతో ఆ ప్రాంతం దాదాపు రెండు గంటల పాటు దద్దరిల్లింది. ఆస్పత్రిలో మంటల్లో చిక్కుకున్న వారిని స్థానికులు, పోలీ సులు, ఫైర్ సిబ్బంది కలిసి బయటకు తీసుకు వచ్చి వేర్వేరు ఆస్పత్రులలో చేర్పించారు. దట్టమైన పొగ కారణంగా కొంత మంది రోగులు, వారి బంధు వులు తీవ్ర ఆస్పస్థతకు గురయ్యారు. వీరిలో మరికొంత మంది పరిస్థితి విష మంగా ఉందని తెలుస్తోంది. ఏ రోగిని ఏ ఆస్పత్రిలో చేర్పించారన్న ఆదుర్ధాతో వారి బంధువులు వెదుకులాటలో ఉన్నారు.
రోగులను వదిలి డాక్టర్ల పరుగు
ఆస్పత్రిలో సిలెండర్ పేలి షార్ట్ సర్కూట్ సంబవించి ఒక్క సారిగా మంటలు ఎగసి పడటంతో అంతవరకు విధులను నిర్వహిస్తున్న డాక్టర్లంతా రోగులను వదిలేసి తలో దిక్కున పారిపోయారు. పెద్దగా శబ్ధం రావడం, దట్టమైన పొగ చుట్టుముట్టడంతో రోగులు, వారి బంధువులు ఒక్క సారిగా ఆదుర్ధాకు లోన య్యారు. ఇదే సమయంలో అప్పటి వరకు రోగుల పర్యవేక్షణలో ఉన్న డాక్ట ర్లంతా వీరందరినీ వదిలేసి ఉరుకులు, పరుగులు తీశారు. రోగులకు ఉపశ మనం కలిగించాల్సిన డాక్టర్లు పరుగులు పెట్టడంతో అప్పటి వరకు ఏం జరు గుతుందో తెలియని రోగులు మరింత ఆందోళనకు గురయ్యారు.
ఉప ముఖ్యమంత్రి సందర్శన ఆస్పత్రిలో సిలెండర్ పేలుడు ఘటన విష యం తెలుసుకున్న వెంటనే జిల్లా లోనే ఉన్న ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, సిపి సుధీ ర్‌బాబు, పోలీస్ సిబ్బంది, బిజెపి అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, ఈగ మల్లేశం హాస్పటల్‌ను సందర్శించి క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. ఈ సంఘటన జరిగిన ఘటనపై హాస్ప టల్ డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి, ఇతర డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనం తరం అక్కడే ఉన్న మీడియా వారితో మాట్లాడుతూ హాస్పటల్ ఆపరేషన్ థియే టర్‌లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పేల డంతో ఘటన చోటు చేసుకుందన్నారు. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు మృతి చెందారన్నారు. దీనిపై సమగ్ర విచారణ కొరకు సిపి సుధీర్‌బాబును ఆదేశిం చామని, నివేదిక వచ్చిన తర్వాత హాస్ప టల్ యాజమాన్యంపై చర్యలు తీసు కుంటామన్నారు. ఘటనలో గాయాల పాలైన వారికి, మృతులకు తక్షణ పరి హారం చెల్లిస్తామన్నారు. అనంతరం సిపి సుధీర్‌బాబు మాట్లాడుతూ హాస్ప టల్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలి రెండవ ఫోర్ల్, మూడవ ఫ్లోర్ భయానక వాతా వరణం నెలకొన్నదని పేషెంట్ల అం దరిని ఇతర ఆస్పత్రికి తరలించామ న్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటా మని, రోగులకు, రోగుల బంధువు లకు హామీ ఇచ్చారు. అనంతరం ఫైర్ ఇన్స్‌పెక్టర్ మాట్లాడుతూ ఆరు ఫైరిం జన్లతో 36 మంది సిబ్బందితో మంటలు ఆర్పామని మంటలన్ని అదుపులో ఉన్నాయని, పొగ వల్ల పలువురికి ఊపిరి ఆడక పోవడంతో కొంత సేపు ఇబ్బందులకు గురయ్యారన్నారు. హాస్పటల్ చుట్టూ ఫైరింజన్లు తిరిగే సదు పాయం లేదని కావున ముందు నుంచి మాత్రమే ఫైరింజన్లతో మంటలు ఆర్పామని ఆయన తెలిపారు.
నిర్లక్షమే కారణం : ఘటనకు ఆస్పత్రి నిర్లక్షమే కారణమని రోగు ల బంధువులు ఆరోపించారు. ప్రమాదం జరిగిన వెంటనే రోగులను అప్రమ త్తం చేయాల్సిన వైద్యులు పారిపోయారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు కూడా లేవని, కనీసం ఆపరేషన్ థియే టర్ లోనూ సౌకర్యాలు లేకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని వారు అ న్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి హాస్పటల్ యాజమాన్యంపై చర్య లు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ హాస్పటల్‌లో ఫైరింజన్ చుట్టు తిరగడానికి కనీస వసతులు కూడా లేవని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.