Home జాతీయ వార్తలు 4 రోజుల సిబిఐ కస్టడీకి చిదంబరం

4 రోజుల సిబిఐ కస్టడీకి చిదంబరం

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో బుధవారం రాత్రి తన ఢిల్లీలోని తన నివాసంలో అరెస్టు అయిన మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరంను నాలుగు రోజుల సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. అయితే చిదంబరంను ఆయన కుటుంబ సభ్యులు ప్రతిరోజు అరగంట పాటు కలుసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఐఎన్‌ఎక్ మీడియా కేసులో చిదంబరంకు కీలక పాత్ర ఉందని ఆరోపించిన సిబిఐ ఆయనను ఐదురోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని వాదించింది.

గత రాత్రి, ఈరోజు చిదంబరంను తమ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించిన సిబిఐ సాయంత్రం 3 గంటలకు కోర్టులో ప్రవేశపెట్టింది. అంతకన్నా ముందే చిదంబరం భార్య నళిని, కుమారుడు కార్తీ కోర్టు వద్దకు చేరుకున్నారు. వారితో పాటు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింగ్వి ఉన్నారు. కొద్ది సేపు తన న్యాయవాదులతో మాట్లాడిన చిదంబరం అనంతరం జడ్జి ఎదుట నిందితుల బాక్సులో నిలబడ్డారు. జడ్జితోపాటు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితరులు కూర్చోవాలని కోరినప్పటికీ కోర్టు విచారణ పూర్తయ్యేంతవరకు చిదంబరం నిలబడే ఉన్నారు.

P Chidambaram arrested in INX Media case, sent to CBI custody for 4 daysChidambaram was brought to the Rouse Avenue court complex around 3pm