Home తాజా వార్తలు రాములు నామినేషన్ దాఖలు

రాములు నామినేషన్ దాఖలు

TRS MP Pothuganti Ramulu

 

వనపర్తి: ఎప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 16 మంది ఎంపిలను భారీ మెజార్టీతో గెలిపించి సిఎం కెసిఆర్‌కు కానుకగా ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ, పౌర సరఫరాల మార్కెటింగ్ సహకార శాఖా మంత్రి నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపి టిఆర్‌ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు శుక్రవారం ఉదయం 11 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్‌కు నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఎంపి అభ్యర్థి రాములు వెంట రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, జడ్పీచైర్మన్ బండారు భాస్కర్ ఎంఎల్‌ఎలు మర్రి జనా ర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్, అబ్రహం, గువ్వల బాల్‌రాజు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిలు ఎంపి రాములుకు కృతజ్ఞతలు తెలిపి ఎంపి అభ్యర్థి రాములును ఘనంగా సన్మానించారు. కాగా.. వనపర్తి జిల్లా నుండి 7 మండలల్లోని నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు విశేష సంఖ్యలో ఎంపి నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు.

 P. Ramulu Nomination as Nagar Kurnool Parliament MP