Wednesday, April 17, 2024

పచ్చిపులుసు పసందుగా

- Advertisement -
- Advertisement -

 

ఇంటికి చుట్టాలొస్తే కోడికూర తెచ్చినా, యాటకూర వండినా… వాటితో పాటు పచ్చిపులుసు ఉండాల్సిందే. అంతలా ఇష్టపడతారు ఈ పులుసుని. అయితే… ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. సాధారణంగా పచ్చిపులుసు తెలియని వారుండరు. కొంతమంది దీన్ని చాలా బాగా తయారు చేస్తారు. మరికొందరికి తెలియదు.అప్పుడప్పుడూ ఇలా తయారుచేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది కూడా.

నువ్వుల పులుసు

కావాల్సినవి: నువ్వులు :అరకప్పు, ఉల్లిగడ్డ తరుగు: పావు కప్పు, జీలకర్ర: పావు టీస్పూన్, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: ఒక రెమ్మ, ఉప్పు: తగినంత, పసుపు: చిటికెడు, ఎండుమిర్చి: ఐదు, చింతపండు పులుసు: ఒకటిన్నరకప్పు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, నూనె: సరిపడా
తయారీ: కట్టెల పొయ్యి లేదా గ్యాస్ స్టవ్ మీద గిన్నె పెట్టి నువ్వులను ఎర్రరంగు వచ్చేవరకు వేగించాలి. వేగిన నువ్వులను వేరే గిన్నెలోకి తీసుకుని, స్టవ్‌మీద ఉన్న గిన్నెలో కొద్దిగా నూనె, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించాలి. తర్వాత వేగించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు వేసి రోట్లో దంచాలి. ఈ చింతపండు పులుసులో వేసి కలపాలి. పులుపు చూసి సరిపడా ఉప్పు వేయాలి. అందులోనే ఉల్లిగడ్డ తరుగు వేసి కలపాలి. మళ్లీ స్టవ్‌పై గిన్నె పెట్టి నూనె వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు వేయాలి. ఆ పోపును పులుసులో వేసి కలపాలి. కావాలంటే చివర్లో పచ్చిమిర్చి తరుగు లేదా కొద్దిగా కారం వేసుకోవచ్చు.

పచ్చిపులుసు

కావాల్సినవి: చింతపండు పులుసు : ఒకటిన్నర కప్పు, ఉల్లిగడ్డ తరుగు: పావుకప్పు, కరివేపాకు: ఒకరెమ్మ, పసుపు: చిటికెడు, పచ్చిమిర్చి: ఐదు, ఎండుమిర్చి: రెండు, జీలకర్ర: పావుటీ స్పూన్, ఆవాలు: పావు టీస్పూన్, నూనె: సరిపడా, ఉప్పు: తగినంత, కొత్తిమీర తరుగు: ఒకటేబుల్ స్పూన్
తయారీ: పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్రను నూనె లేకుండా చిన్నమంటపై వేగించాలి. వాటన్నింటినీ రోట్లో వేసి రుబ్బాలి. రుబ్బిన మిశ్రమాన్ని చింతపండు పులుసులో వేసి కలపాలి. అందులోనే పసుపు, కొత్తిమీర తరుగు, కరివేపాకు వేయాలి. లేదంటే నూ నెలో జీలకర్ర, ఆవాలు, పసుపు, కరి వేపాకు, కొత్తిమీర వేసి పోపు పెట్టి పులు సు, చివరగా ఉల్లిగడ్డ తరుగు వేసి కల పాలి. వేడి వేడి అన్నంలో ఉత్త పులుసు పోసుకుని తిన్నా.. రుచి అదిరిపోతుంది.

వంకాయ పులుసు

కావాల్సినవి: పచ్చిమిర్చి: పన్నెండు, ఉల్లిగడ్డ తరుగు: అరకప్పు, చింతపండు పులుసు: ఒకటిన్నర కప్పు, చిన్న వంకాయలు: మూడు, ఉప్పు తగినంత, నూనె: సరిపడా.
తయారీ: వంకాయలను బొగ్గులు లేదా స్టవ్ మంటపై కాల్చాలి. అలాగే స్టవ్‌పై గిన్నెపెట్టి కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చిని వేగించాలి. తర్వాత ఒక గిన్నెలో వేగించిన పచ్చిమిర్చి, ఉప్పువేసి బాగా పిసకాలి. వంకాయలపై తొక్కు తీసి, వాటిని గిన్నెలో వేసి పప్పు గుత్తితో రుబ్బాలి. తర్వాత వాటిని పులుసు, ఉల్లిగడ్డ తరుగు వేసి కలపాలి. అంతే, ఎంతో రుచికమైన వంకాయ పులుసు రెడీ. కావాలంటే చివర్లో పోపు పెట్టుకోవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News