న్యూఢిల్లి: వివిధ రంగాల్లో సేవలందించిన పలువురు ప్రముఖులకు గణతంత్ర దినోత్సవం పురస్కారించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు పదవిభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. అలాగే కేంద్రం పలువురు ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. వైద్యరంగంలో కేరళకు చెందిన ఎం.ఆర్ రాజగోపాల్, కళారంగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన భజ్జు శ్యామ్, మహారాష్ట్రకు చెందిన విజయలక్ష్మి నవనిత కృష్ణన్, సామిజిక రంగంలో బెంగాల్‌కు చెందిన 98 ఏళ్ల సుధాన్షు బిశ్వాన్, సుభాషిణి మిస్త్రి విద్యారంగంలో మహారాష్ట్రకు చెందిన శాస్త్రవేత్త అరవింద్ గుప్తా, క్రిడారంగంలో మహారాష్ట్రకు చెందిన మురళికాంత్ పేట్కర్, సైన్స్ అండ్ ఇంజినిరింగ్ రంగంలో తమిళనాడుకు చెందిన రాజగోపాలన్ వాసుదేవన్, తదితరులను ఈ పురస్కారానికి ఎంపికచేసింది. 2018 ఏడాదిలో ఇచ్చే ఈ పురస్కారాల కోసం మొత్తం 15700 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ఈ పద్మ శ్రీ అవార్డులను మొత్తం 89 మందికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం
- Advertisement -
- Advertisement -