Home జాతీయ వార్తలు పద్మ అవార్డుల ప్రదానం

పద్మ అవార్డుల ప్రదానం

padma-awardsన్యూఢిల్లీ:అత్యున్నత పౌర పురస్కారా లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. శాస్త్ర సాం కేతిక రంగం, వైద్యం, సాహి త్యం, కళలు, సామాజిక సేవ, పౌర సంబంధాలు,వర్తక వా ణిజ్యాలు, విద్య, క్రీడలు రం గాల్లో ప్రతిభ కనబర్చిన 112 మందిని పద్మ అవార్డులకు ఈ ఏడు ఎంపిక చేశారు. వీరి లో సగం మందికి (56) సోమవారం అవార్డులను ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. మిగతా వారికి వచ్చే నెలలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో అంగరంగ వైభవంగా నిర్వహిం చిన వేడుకల్లో ప్రధాని మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. తెలంగాణకు రెండు పద్మవిభూషన్, రెండు పద్మశ్రీలు దక్కాయి. వైద్య రంగంలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చేసిన సేవలకుగాను ప్రొఫెసర్ డి.నాగేశ్వర్‌రెడ్డి, క్రీడల్లో ప్రతిభ కనబర్చిన సైనా నెహ్వాల్‌కు పద్మ భూషన్ వరించింది. పెయింటింగ్‌లో సత్తా చాటిన లకా్ష్మగౌడ్, సామాజిక సేవలో ఎనలేని సేవలు చేసిన డాక్టర్ టి.వి.నారాయణకు పద్మశ్రీ అవార్డులను ప్రణబ్ ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురిని పద్మ ఆవార్డులు వరించాయి. కెమికల్ టెక్నాలజీ రంగంలో ప్రతిభ కనబర్చిన ఎవి రామారావుకు పద్మ భూషన్, వైద్య రంగంలో ప్రతిభ కనబర్చిన గోపాలకృష్ణ గోఖలే, నాయుడమ్మ యార్లగడ్డకు పద్మశ్రీ అవార్డులు వరించాయి.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్‌కు, జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ జగ్‌మోహన్, భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఎకనామిస్ట్ అవినాష్ కమలాకర్ దీక్షిత్, ప్రముఖ నర్తకి యామినీ కృష్ణమూర్తి పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు. రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు కీర్తిశేషులు ధీరూబాయి అంబానీ తరపున ఆయన భార్య కోకిలా బెన్ అంబానీ పద్మ విభూషణ్ అవార్డును స్వీకరించారు. సినీ రంగం నుంచి అనుపమ్ ఖేర్‌కు పద్మభూషణ్, అజయ్‌దేవ్‌గన్, మదుర్‌బండార్కర్‌కు పద్మశ్రీ అవార్డులు వరించాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రియాంక చోప్రా వచ్చే నెలలో అవార్డులు స్వీకరించనున్నారు. తెలంగాణ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన మరో ఇద్దిరికి కూడా వచ్చే నెలలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. తెలంగాణకు చెందిన సానియా మీర్జా (క్రీడలు, పద్మభూషణ్), డాక్టర్ మన్నం గోపీచంద్ ( వైద్యం, పద్మ భూషణ్)కు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన రామోజీరావు ( విద్య, జర్నలిజంలో, పద్మభూషన్ ) యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ( సాహిత్యం మరియు విద్య , పద్మ భూషన్ ) ఆల్ల వెంకట రామ్మోహన్‌రావు ( సైన్స్ అండ్ ఇంజనీరింగ్, పద్మ భూషణ్), సునీతాకృష్ణన్ (పద్మశ్రీ, సామాజిక సేవ) వచ్చే నెలలో అవార్డులు అందుకోనున్నారు. ఈసారి మొత్తం 112 పద్మ అవార్డులు ప్రకటించగా వీటిలో 10 మందికి పద్మ విభూషణ్, 19 మందిని పద్మ భూషణ్, 83 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేశారు.