Home జాతీయ వార్తలు చాయ్‌వాలా, పద్మశ్రీ ప్రకాశ్‌రావు కన్నుమూత

చాయ్‌వాలా, పద్మశ్రీ ప్రకాశ్‌రావు కన్నుమూత

Padma Shri chaiwala Prakash Rao passes away

 

కటక్: సామాజిక కార్యకర్త, చాయ్‌వాలా, పద్మశ్రీ గ్రహీత డి.ప్రకాశ్‌రావు(63) కన్నుమూశారు. కరోనా సోకడంతో 20 రోజుల క్రితం కటక్‌లోని ఎస్‌సిబి వైద్య కళాశాలలో చికిత్స పొం దుతూ బుధవారం సాయంత్రం మరణించారు. ప్రకాశ్‌రావు కటక్‌లోని బక్సీ బజార్‌లో టీ కొట్టు నడుపుతూ వచ్చిన సంపాదనలో కొంత మురకివాడల్లోని చిన్నారుల ఆహారం, విద్య కోసం ఖర్చు చేశారు. 2000 నుంచి ‘ఆశా ఓ ఆశ్వాసన’ పేరుతో పాఠశాలను కూడా నడిపారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది. ప్రధాని మోడీ తన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రకాశ్‌రావు దాతృత్వం గురించి తెలుపుతూ కొనియాడారు. ప్రకాశ్‌రావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.